Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రత్యేక సింధ్ దేశం కోరుతూ నిరసనలు.. పాకిస్థాన్ నుంచి విముక్తి కావాలి

Advertiesment
ప్రత్యేక సింధ్ దేశం కోరుతూ నిరసనలు.. పాకిస్థాన్ నుంచి విముక్తి కావాలి
, సోమవారం, 18 జనవరి 2021 (13:50 IST)
Sindhu
సింధీలకు ప్రత్యేక దేశం కోరుతూ నిరసనలు వెల్లువెత్తాయి. పాకిస్తాన్ నుంచి తమకు విముక్తి కలిగించి స్వేచ్చను ప్రసాదించాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ విషయంలో మోదీ, ఇతర ప్రపంచ నేతలు జోక్యం చేసుకోవాలని నిరసనకారులు కోరారు. సింధ్‌లోని శాన్ నగరంలో ఈ ర్యాలీ ఆదివారం జరిగింది. 1967లో జీఎం సయీద్, పీర్ అలీ మహమ్మద్ రషీద్ ఈ డిమాండును లేవనెత్తారు. 
 
పాకిస్థాన్  ప్రభుత్వం, సైన్యం కారణంగా సింధ్ వాసులు ఎన్నో వేధింపుల బారిన పడుతున్నారని నిరసన కారులు పేర్కొన్నారు. బెలూచిస్థాన్ ప్రజలు కూడా దాదాపు ఇదేవిధమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ రాష్ట్రం నుంచి అనేకమంది మేధావులు, కళాకారులు, విద్యావేత్తలు పాక్ కు భయపడి ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఆయా దేశాల్లో శరణార్థులుగా ఉంటున్నారు.
 
తమ రాష్ట్రం ఇండస్-వ్యాలీ నాగరికతకు, వేదిక్ రిలిజిన్‌కి ప్రతీక అని, బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని 1947లో పాకిస్థాన్‌కు అప్పగించిందని ర్యాలీలో పాల్గొన్నవారు పేర్కొన్నారు. సింధీలకు ప్రత్యేక దేశం.. సింధు దేశ్ ఇవ్వాలని నిరసనకారులు కోరుతున్నారు. 1967 లో జీఎం సయీద్, పీర్ అలీ మహమ్మద్ రషీద్ ఈ డిమాండును లేవనెత్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం .. ఏంటది?