సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్ ప్యాకెట్‌పై 16 బిస్కెట్ల సంఖ్య ఉంటుంది. కానీ అందులో కేవలం 15 బిస్కెట్లు మాత్రమే ఉన్నాయని ఆరోపిస్తూ చెన్నైకి చెందిన డిల్లిబాబు అనే వ్యక్తి స్థానిక డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెస్సల్ ఫోరంలో ఫిర్యాదు చేశాడు.
ప్యాకెట్‌లో బిస్కెట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో సదరు బిస్కెట్ కంపెనీ ఈ వినియోగదారుడు కన్‌జ్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశాడు. బిస్కెట్ ప్యాకెట్‌పై సూచించిన సంఖ్య కంటే ఒకటి తక్కువగా ఉండటాన్ని కన్‌జ్యూమర్ ఫోరం తీవ్రంగా పరిగణించింది.
వినియోగదారులను మోసం చేయడాన్ని తప్పుపట్టింది. దీంతో ఫిర్యాదు దారుడికి ఏకంగా లక్ష రూపాయలు చెల్లించాలని బిస్కెట్ కంపెనీని ఆదేశించింది. ఆ బ్యాచ్ బిస్కెట్ ప్యాకెట్ల విక్రయాలను కూడా నిలిపివేయాలని పేర్కొంది.