ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ దివ్య స్పందన (రమ్య) మృతి చెందినట్లు వచ్చిన వార్తలపై ఆ పార్టీకి చెందిన తమిళనాడు నేత, ఐటీ సెల్ ఛైర్మన్ లక్ష్మీకాంతన్ తీవ్రంగా మండిపడ్డారు. రమ్యపై వస్తున్న వార్తలన్నీ అసత్యాలేనని.. అవన్నీ నూటికి నూరు శాతం తప్పుడు వార్తలని క్లారిటీ ఇచ్చారు.
దివ్య జెనీవాలో ఆరోగ్యంగా వున్నప్పటికీ ఇలాంటి వార్తలను ప్రచురించడం ఏంటని ప్రశ్నించారు. ఫోన్ చేసి మాట్లాడినట్లు పలువురు జర్నలిస్ట్‌లు తెలిపారు. బాధ్యతలేని వ్యక్తులు ఇలాంటి రూమర్స్ సృష్టించినట్లు స్పష్టం చేశారు.
కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందన మృతి చెందారు. ఆమెను గుర్తు చేసుకుంటూ ఇటీవల విజయ్ ఓ పోస్ట్ పెట్టారు. దీంతో కొందరు నెటిజన్లు స్పందన హ్యాష్ ట్యాగ్‌తో సంతాపం తెలిపారు.
ఇది చూసిన ఓ నెటిజన్... ఆ స్పందనే దివ్యస్పందనగా పొరబడి ఆమెను ట్యాగ్ చేస్తూ చనిపోయినట్లుగా పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.