Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చరిత్ర సృష్టించిన బీజేపీ - అస్వస్థతకులోనైన అరుణ్ జైట్లీ

Advertiesment
చరిత్ర సృష్టించిన బీజేపీ - అస్వస్థతకులోనైన అరుణ్ జైట్లీ
, శుక్రవారం, 24 మే 2019 (11:49 IST)
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించింది. గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సింగిల్‌గా 303 సీట్లను కైవసం చేసుకుంటే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఏకంగా 353 స్థానాలతో అతిపెద్ద కూటమిగా అవతరించింది. దీంతో బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాయి. 
 
ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం అనారోగ్యానికి గురయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఇటీవలే డిశ్చార్జ్ అయిన జైట్లీ మళ్లీ తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆయన్ను చికిత్స కోసం లండన్‌కు తరలించనున్నారు. 
 
కాగా, వచ్చే నెల నాలుగో తేదీన ఈయన కుమారుడు వివాహం జరుగనుంది. ఈ పరిస్థితుల్లో జైట్లీ తీవ్ర అనారోగ్యానికి గురికావడం ఇపుడు ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఫలితంగా ఆయన్ను లండన్‌కు తరలించి చికిత్స అందించాలని భావిస్తున్నారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్న అతి ముఖ్యమైన అనుచరుల్లో అరుణ్ జైట్లీ ఒకరు. మోడీ సర్కారులో అత్యంత కీలకభూమికను పోషిస్తున్న జైట్లీ.. అనారోగ్యం దృష్ట్యా 17వ లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పట్టం కట్టిన ఓటర్లకు జైట్లీ కృతజ్ఞతలు తెలుపగా, రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేనకు షాక్.. జేడీకి చుక్కెదురు.. కారణం ఏమిటి?