Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ రాక్షసి వెళ్లిపోయింది... మిమ్మిల్ని గౌరవిస్తాను : మహమ్మద్ యూనస్!!

mohammed younis

ఠాగూర్

, మంగళవారం, 13 ఆగస్టు 2024 (13:45 IST)
బంగ్లాదేశ్ నుంచి రాక్షసి వెళ్లిపోయిందంటూ బంగ్లాదేశ్, తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఎన్నికైన నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనిస్ తనను కలిసిన విద్యార్థులతో అన్నారు. పైగా, విద్యార్థులను తాను గౌరవిస్తానని వారికి హామీ ఇచ్చారు. 
 
బంగ్లాదేశ్, తాత్కాలిక ప్రభుత్వ సారథిగా గత గురువారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెల్సిందే. గత ఆదివారం రాత్రి ఆయన విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆందోళనలను ముందుండి నడిపించిన విద్యార్థి సంఘాల నాయకులను ఆయన ప్రశంసించారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, యూనస్ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఉద్దేశించి 'మాన్‌స్టర్ (రాక్షసి) వెళ్లిపోయింది' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. విద్యార్థుల వరుస నిరసనల తర్వాత దేశం నుంచి పారిపోయిన మాజీ ప్రధాని హసీనాను ఉద్దేశించి 'చివరిగా ఈ క్షణం వచ్చింది. రాక్షసి వెళ్లిపోయింది' అన్నారు. 
 
'విద్యార్థుల నేతృత్వంలో ప్రారంభమైన విప్లపం మొత్తం ప్రభుత్వాన్నే కూల్చేసింది. నిరంకుశ పాలనకు ముగింపు పలికింది. దేశం నుంచి మానర్ (రాక్షసి) వెళ్లిపోయింది. మిమ్మల్ని నేను గౌరవిస్తాను. మీరు తాత్కాలిక పరిపాలన బాధ్యతలు తీసుకొమ్మని కోరినందు వల్లే అంగీకరించాను' అని ముహమ్మద్ యూనస్ పేర్కొన్నారు. 
 
ఇక 2006లో మైక్రోఫైనాన్స్‌లో చేసిన కృషికిగాను నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. 84 ఏళ్ల యూనస్. కమ్యూనిటీ అభివృద్ధి కోసం గ్రామీణ్ బ్యాంకును కూడా స్థాపించారు. ప్రభుత్వ సర్వీసుల్లో రిజర్వేషన్ కోటాపై నిరసనల కారణంగా బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 
 
దాంతో ఐదుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం నుంచి వెళ్లిపోవడానికి దారితీసింది. ఆ తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మథురలో మాయమైన స్వామీజీ శ్రీకాళహస్తిలో ప్రత్యక్షం.. ఎలా? ఎందుకు?