Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు జైలుశిక్ష... ఎక్కడ?

mohammed younis
, మంగళవారం, 2 జనవరి 2024 (09:34 IST)
బంగ్లాదేశ్‌లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు జైలుశిక్షపడింది. ఆయన పేరు మహ్మద్ యూనస్. 83 యేళ్ల ఈ నోబెల్ బహుమతి గ్రహీత... బంగ్లాదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మందిని పేదరికం కోరల నుంచి గట్టెక్కించారు. దీన్ని గుర్తించి నోబెల్ అకాడెమీ.. ఆయనకు నోబెల్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 
 
ముఖ్యంగా, ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా అందించిన చిన్న రుణాలు పేదల జీవితాలను మార్చివేశాయని నోబెల్ కమిటీ భావించి, అత్యున్నత పురస్కారం అందించి గౌరవించింది. కానీ, అదే మైక్రో ఫైనాన్స్ అంశంలో ఆయనకు నోబెల్ బహుమతిని అందజేసింది. అయితే, 
 
అయితే, బంగ్లాదేశ్ కార్మిక చట్టాలను యూనస్ ఉల్లంఘించారంటూ బంగ్లాదేశ్ కోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఆయనతో పాటు గ్రామీణ్ టెలికాం సంస్థకు చెందిన మరో ముగ్గురికి కూడా ఈ వ్యవహారంలో జైలు శిక్ష పడింది. 
 
అటు, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా నోబెల్ శాంతి బహుమతి విజేత మహ్మద్ యూనస్‌పై ధ్వజమెత్తారు. పేద ప్రజల రక్తాన్ని వడ్డీల రూపంలో పీల్చివేస్తున్నారంటూ మండిపడ్డారు. కాగా, ఇదంతా రాజకీయ కుట్ర అని మహ్మద్ యూనస్ మద్దతుదారులు బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు.
 
జపాన్ భూకంపంపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి...
 
కొత్త సంవత్సరం రోజున జపాన్ దేశం భారీ భూకంపంతో వణికిపోయింది. దీనిపై టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. జపాన్‌‍లో సంభవించిన వరుస భూకంపాల ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త సంవత్సరం వేడుకలను జపాన్‌లో జరుపుకున్నారు. అలాగే, ఆయన చిత్రం షూటింగ్ కూడా జపాన్‌లో జరిగింది. ఒకవైపు షూటింగ్ పూర్తికావడంతో, మరోవైపు, కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుని సోమవారం రాత్రి హైదరాబాద్ నగరానికి తిరిగివచ్చారు. తాను నటిస్తున్న కొత్త చిత్రం దేవర షూటింగులో వారం రోజుల జపాన్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జపాన్‌లో సంభవించిన వరుస భూకంపాలపై ఆయన స్పందించారు. 
 
"దేవర" చిత్రీకరణ జరిపిన ప్రాంతంలో భూకంపం రావడం తన హృదయాన్ని కలిచివేసిందన్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు త్వరగా కోలుకోవాలని తారక్ ట్వీట్ చేశారు. జపాన్ దేశంలో సోమవారం దాదాపు 21 సార్లు భూమి కంపించిన విషయం తెల్సిందే. దీంతో జపాన్ పశ్చిమ ప్రాంతం అల్లకల్లోలమైంది. ఈ భూకంపం ధాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. వరుసగా సంభవించిన భూకంపాలతో ప్రభుత్వం తొలుత భారీ సునామీ హెచ్చరికలు చేసింది. దీంతో సముద్రతీర ప్రాంతాల వాసులను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో భారీగా పెరిగిపోతున్న చికెన్ - కోడిగుడ్డు ధరలు...