Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భార్యను లవ్ చేయాలి... ఉద్యోగిని ప్రోత్సహించిన యజమాని...

Advertiesment
నా భార్యను లవ్ చేయాలి... ఉద్యోగిని ప్రోత్సహించిన యజమాని...
, ఆదివారం, 22 డిశెంబరు 2019 (10:57 IST)
తన భార్యను ప్రేమించాలంటూ తన కింద పనిచేసే ఉద్యోగిని యజమానే ప్రోత్సహించిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న కేసును విచారించిన గుజరాత్ పోలీసులు, నరాలు తెగే ఉత్కంఠకు సమానమైన రియల్ క్రైమ్ స్టోరీని వెలుగులోకి తెచ్చారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఐదు నెలల క్రితం నిఖిల్ పర్మార్ అనే 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతికి యజమానే కారణమని వెల్లడైంది. వాస్నా సమీపంలోని వెడ్డింగ్ డెకరేషన్ కంపెనీలో, గత సంవత్సరం నిఖిల్ ఉద్యోగంలో చేరాడు. ఆపై 10 నెలల తర్వాత తాను ఉద్యోగం మానేస్తున్నానని తండ్రి అశోక్‌కు చెప్పాడు. 
 
తన యజమాని, అతని భార్య వేధిస్తున్నారంటూ వాపోయాడు. జీతం తీసుకుని వస్తానని జూలై 14న ఆఫీసుకు వెళ్లిన నిఖిల్, ఆపై అతనితో కలిసి రాజస్థాన్‌కు వెళుతున్నానని చెప్పాడు. ఆపై ఐదు రోజులకు నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం అందింది.
 
మూడు నెలల తర్వాత నిఖిల్ తోబుట్టువులు సంజయ్, నిషలు సెల్ ఫోన్‌ను పరిశీలిస్తుండగా, నమ్మలేని విషయాలు బయటకు వచ్చాయి. తన యజమానికి నిఖిల్ పంపిన మెసేజ్‌లు ఉన్నాయి. 
 
'మీ భార్యను ప్రేమించమని నాకు చెప్పారు. మీరు చెప్పినట్టే చేశాను. ఇప్పుడామె నన్నూ ప్రేమిస్తోంది. వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాము. ఇప్పుడు మీరు మాట మార్చారు. మా రిలేషన్ షిప్‌ను వదులుకోమని అంటున్నారు. బెదిరిస్తున్నారు. జీతం ఇవ్వడం లేదు. నన్ను మీ బానిసలా చూడొద్దు. నా మీద దయ చూపండి' అని వేడుకుంటున్న మెసేజ్‌‌లు సెల్ ఫోనులో ఉన్నాయి.
 
వాటి ఆధారంగా కేసును దర్యాఫ్తు చేసిన పోలీసులు, యజమాని భార్య అతనికన్నా 20 ఏళ్లు చిన్నదన్న విషయం పసిగట్టారు. అశోక్ పర్మార్ ప్రోత్సాహంతో ఆయన భార్యతో నిఖిల్ సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. తనతో నిఖిల్ కు ఉన్న బంధం వెనుక భర్త ఉన్నాడని తెలుసుకున్న ఆమె తట్టుకోలేక, భర్తతో గొడవ పడింది. 
 
ఇక ఈ గొడవలు తనకు వద్దని భావించిన అశోక్, నిఖిల్‌ను హెచ్చరించాడు. అశోక్ భార్య మాత్రం నిఖిల్‌ను వదిలేందుకు ఇష్టపడకుండా, అతన్ని సంబంధం కొనసాగించాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో ఇద్దరి మధ్యా నలిగిపోయిన నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసును విచారించిన పోలీసులు, వారిద్దరిపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు కాదు... 25 రాజధానులు నిర్మించాలి : కేశినేని నాని