కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో దారుణం జరిగింది. మొబైల్ చోరీ చేశాడనీ వృషణాలను కోసిపారేశారు. అదీకూడా పట్టపగలు, జనసంచారం రద్దీగా ఉండే తిరువనంతపురం బస్టాండులో ఈ ఘటన జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరువళ్లంకు చెందిన 30 ఏళ్ల యువకుడు ఇటీవలే తిరువనంతపురం బస్టాండ్‌కు వెళ్లాడు. రాత్రి సమయంలో బస్టాండ్‌లో నిద్రిస్తున్న మరో వ్యక్తి సెల్‌ఫోన్, పర్స్‌ను ఈ యువకుడు దొంగిలించినట్లు స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లు అనుమానించారు.
దీంతో సెల్‌ఫోన్ దొంగిలించడాన్న నెపంతో.. ఆ యువకుడిని తీవ్రంగా చితకబాది పదునైన ఆయుధాలతో వృషణాలను కోసేశారు. ఆ తర్వాత ఆ భాగంలో పెట్రోల్ పోసి తగులబెట్టారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రైవేట్ భాగాల్లో పెట్రోల్ పోసి తగులబెట్టడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే యువకుడిని చితకబాదిన దృశ్యాలను ఓ వ్యక్తి తన ఫోన్‌లో చిత్రీకరించి వైరల్ చేశాడు. ఈ వీడియో ఆధారంగా ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.