Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో ఇంటర్నెట్ కొత్తకాదు.. మహాభారతం కాలం నుంచే ఉంది : త్రిపుర సీఎం

భారత్‌లో ఇంటర్నెట్ కొత్తకాదనీ, మహాభారత కాలం నుంచే ఉందని త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దెబ్ చెప్పుకొచ్చారు. అగర్తలలో 'కంప్యూటరైజేషన్, సంస్కరణ'లపై జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించార

Advertiesment
భారత్‌లో ఇంటర్నెట్ కొత్తకాదు.. మహాభారతం కాలం నుంచే ఉంది : త్రిపుర సీఎం
, బుధవారం, 18 ఏప్రియల్ 2018 (14:42 IST)
భారత్‌లో ఇంటర్నెట్ కొత్తకాదనీ, మహాభారత కాలం నుంచే ఉందని త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దెబ్ చెప్పుకొచ్చారు. అగర్తలలో 'కంప్యూటరైజేషన్, సంస్కరణ'లపై జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
భారత్‌లో మహాభారత్ కాలం నుంచే ఇంటర్నెట్, శాటిలైట్ మనుగడలో ఉన్నాయని, కొత్తేమి కాదన్నారు. లక్షల సంవత్సరాల క్రితమే భారత్ ఇంటర్నెట్‌ను కనుగొన్నదన్నారు. మహాభారత కాలం నుంచే భారత్‌లో ఇంటర్నెట్, శాటిలైట్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చిన ఆయన.. ఈ సందర్భంగా కురుక్షేత్రంలోని ఓ సంఘటనను కూడా ఉదహరించారు కూడా.
 
ధృతరాష్ట్రుడి రథసారధి సంజయుడు. చూపులేని ధృతరాష్ట్రుడికి కురుక్షేత్ర యుద్ధం గురించి సవిరంగా సంజయ ఎలా చెప్పగలిగాడు.. అంటే సాంకేతిక పరిజ్ఞానం అప్పటికే భారత్‌లో అందుబాటులో ఉందని అర్థమన్నారు. వాటి సహాయం ద్వారానే సంజయ యుద్ధం గురించి చెప్పాడన్నారు. యూనైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్‌‌లు తమ ఆవిష్కరణలుగా చెప్పుకుంటున్నప్పటికీ.. వాస్తవానికి అది భారతీయ సాంకేతికతన్నారు. గొప్పస్కృతిక చరిత్ర జాతి సొంతమన్నారు. దానిపట్ల తానెంతో గర్వంగా ఫీలవుతున్నట్టు చెప్పారు.
 
ఇప్పటికే సాంకేతిక రంగంలో మనమే ముందున్నామని గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ సంస్థ యూఎస్ సంస్థే కావచ్చు. అయితే అందులో పనిచేసే ఇంజినీర్లు అత్యధికులు మన దేశానికి చెందినవారేనన్నారు. మహాభారత కాలం నుంచి టెక్నాలజీలో భారత్ ముందున్నదని.. మధ్యలో అది కనుమరుగైందన్నారు. తిరిగి ప్రస్తుతం మళ్లీ టెక్నాలజీలో దూసుకెళ్తుందన్నారు. ప్రపంచానికి అత్యధిక ఇంజినీర్లను అందించడమే ఇందుకు నిదర్శనమని ఈ బీజేపీ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు జనసేన సైన్యం ఉంది.. గన్‌మెన్లు అక్కర్లేదు : పవన్ కళ్యాణ్