Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇందిరా గాంధీ ముక్కు మూసుకున్నారు : ప్రధాని నరేంద్ర మోడీ

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం గుప్పించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని సైతం ఆయన వదిలిపెట్టలేదు. 'ఇందిరా గాంధీ మోర్బీ పర్యటనకు వచ్చ

Advertiesment
ఇందిరా గాంధీ ముక్కు మూసుకున్నారు : ప్రధాని నరేంద్ర మోడీ
, బుధవారం, 29 నవంబరు 2017 (19:26 IST)
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం గుప్పించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని సైతం ఆయన వదిలిపెట్టలేదు. 'ఇందిరా గాంధీ మోర్బీ పర్యటనకు వచ్చినప్పుడు చెడు వాసన వస్తుందని రుమాలుతో ముక్కు మూసుకున్నారు. చిత్రలేఖ మ్యాగజైన్‌లో వచ్చిన ఆ ఫొటో నాకింకా గుర్తుంది. కానీ జనసంఘ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌కు మాత్రం మోర్బీ వీధులు సువాసన వెదజల్లుతాయి. అవి మానవత్వపు పరిమళాలు' అంటూ వ్యాఖ్యానించారు. 
 
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, పాటిదార్‌ ప్రాబల్యం ఉన్న మోర్బీ నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోడీ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. గుజరాత్‌లో నీటి కొరతను తాము అర్థం చేసుకున్నామని.. ప్రతి నీటి బొట్టును ఆదా చేసుకునేలా ఉద్యమం చేపట్టామని ప్రధాని మోడీ అన్నారు. 
 
అభివృద్ధి అంటే కాంగ్రెస్‌ దృష్టిలో చేతిపంపులు ఇవ్వడమని ప్రధాని విమర్శించారు. అంతేకాకుండా, తమ దృష్టిలో అభివృద్ధి అంటే ఎన్నికల్లో గెలవడం కాదని, ప్రతి పౌరుడికి సేవ చేయడమేనన్నారు. అందులో భాగంగానే నర్మద నదీ జలాలను గుజరాత్‌కు తీసుకొచ్చామని గుర్తు చేశారు. 60 యేళ్ళపాటు దేశాన్ని దోచుకున్న వారే దోపిడీ గురించి మాట్లాడుతున్నారంటూ ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యార్థుల ఆత్మహత్యలకు కళాశాలలదే బాధ్యత : సీఎం చంద్రబాబు