Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముచ్చట తీర్చాలంటూ ప్రొఫెసర్ల వేధింపులు? : ఐఐటీ-మద్రాస్ విద్యార్థిని సూసైడ్

Advertiesment
ముచ్చట తీర్చాలంటూ ప్రొఫెసర్ల వేధింపులు? : ఐఐటీ-మద్రాస్ విద్యార్థిని సూసైడ్
, గురువారం, 14 నవంబరు 2019 (10:45 IST)
దేశంలో ప్రసిద్ధిగాంచిన ఉన్నత విద్యా సంస్థల్లో ఐఐటీ మద్రాస్ ఒకటి. కానీ, ఈ విద్యాసంస్థ ఇటీవలికాలంలో తరచూ వార్తలకెక్కుతోంది. ఏదో ఒక వివాదాస్పద సంఘటనతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పరీక్షల్లో ఫెయిల్ కావడం, ఎంపిక చేసుకున్న కోర్సుల మీద ఆసక్తిలేక పోవడం, మానసిక ఒత్తిడి అంటూ విద్యార్థులు బలన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒత్తిళ్ల ఆరోపణలు గుప్పించే వాళ్లు ఎక్కువేగానే ఉంది. తాజాగా ముగ్గుర ప్రొఫెసర్లు పెట్టిన వేధింపులు భరించలేని ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఫాతిమా మరణానికి న్యాయం కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు.  
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రం కొల్లం కిలికొళ్లురు గ్రామానికి చెందిన ఫాతిమా లతీఫ్‌(19) తొలి సంవత్సరం ఎంఏ చదువుతోంది. ప్రతి రోజూ ఇంటికి తప్పని సరిగా ఫోన్‌ చేసినానంతరం నిద్రపోవడం ఫాతిమాకు అలవాటు ఉంది. శనివారం రాత్రి ఆమె తల్లి సజిత లతీఫ్‌ కుమార్తెకు ఫోన్‌ చేసినా సమాధానం లేదు. దీంతో ఆమె స్నేహితురాలికి ఫోన్‌ చేశారు. 
 
ఆమె గదికి స్నేహితురాలు వెళ్లి చూడగా, తలుపులు తెరచుకోలేదు. దీంతో హాస్టల్‌ సిబ్బంది తలుపు పగల కొట్టి లోనికి వెళ్లగా,అ క్కడ ఫ్యాన్‌కు ఉరి పోసుకుని ఫాతిమా వేళాడుతుండటాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న కోట్టూరుపురం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. కేసును ఆత్మహత్యగా నమోదు చేసినా అసలు ట్విస్ట్ అన్నది తాజాగా బయట పడింది. 
 
ఫాతిమా మృతిపై ఆమె తండ్రి అబ్దుల్‌ లతీఫ్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫాతిమా మృతికి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌‌తో పాటు మరో ఇద్దరు ప్రొఫెసర్లే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఫాతిమా స్నేహితులు, ప్రొఫెసర్లను విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొగలు కక్కుతున్న సాంబారు పాత్రలో పడిన యూకేజీ బాలుడు మృతి.. ఎలా?