ర్యాంప్ వాక్ ప్రాక్టీస్‌ చేస్తూ చేస్తూ గుండె ఆగిపోయింది.. విద్యార్థిని మృతి

శనివారం, 19 అక్టోబరు 2019 (19:29 IST)
ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ ఓ విద్యార్థిని ప్రాణాలను బలిగొంది. ఫ్రెషర్స్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ.. ఓ విద్యార్థిని గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పీన్యా ప్రాంతంలోని ఓ కాలేజీలో ఫ్రెషర్స్ డే ఉత్సవాల కోసం విద్యార్థులు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. 
 
ఈ ప్రాక్టీస్‌లో ర్యాంప్ వాక్‌లో ఎంబిఎ మొదటి సంవత్సర విద్యార్థిని షాలిని (21) పాల్గొంది. కానీ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ విద్యార్థిని వేదిక పక్కన ఒక్కసారిగా కుప్పకూలింది. దీనిని గమనించిన సహ విద్యార్థులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. 
 
కానీ అప్పటికే షాలిని గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. షాలిని మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాజుగారి గ‌ది 3 ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత‌..?