Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆల్కహాల్ తాగే అమ్మాయిలను చూస్తే భయమేస్తోంది: మనోహర్ పారికర్

గోవాలో మాదకద్రవ్యాల వ్యాపారంపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడారు. ఆల్కహాల్ తీసుకునే అమ్మాయిల సంఖ్య పెరిగిపోతుందని.. గోవా నుంచి డ్రగ్స్‌ను తరిమికొడతామని మనోహర్ పారికర్ ఉద్ఘాటించారు.

ఆల్కహాల్ తాగే అమ్మాయిలను చూస్తే భయమేస్తోంది: మనోహర్ పారికర్
, శనివారం, 10 ఫిబ్రవరి 2018 (09:31 IST)
గోవాలో మాదకద్రవ్యాల వ్యాపారంపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడారు. ఆల్కహాల్ తీసుకునే అమ్మాయిల సంఖ్య పెరిగిపోతుందని.. గోవా నుంచి డ్రగ్స్‌ను తరిమికొడతామని మనోహర్ పారికర్ ఉద్ఘాటించారు. 
 
గోవా యువత కష్టపడి పని చేయాలనుకోవట్లేదని పారికర్ ఆవేదన వ్యక్తం చేశారు. యువతలో కష్టపడే తత్త్వం కనుమరుగైందని.. సింపుల్ వర్క్ వైపే వారు మొగ్గుచూపుతున్నారని మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వారు క్యూ కడుతున్నారని.. గవర్నమెంట్ జాబ్ అంటే పని వుండదనే భావన వారిలో వుందని మనోహర్ పారికర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
అమ్మాయిల్లో ఆల్కహాల్ సేవించే అలవాటు పెరిగిపోతుందని.. ఇది తనకెంతో భయాన్ని కలుగజేస్తోందని గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కాలేజీల్లో డ్రగ్స్ సంస్కృతి ఎక్కువగా వుందని భావించట్లేదని.. ఇప్పటివరకు 170 మంది డ్రగ్స్ ప్లెడర్లను అరెస్ట్ చేశామన్నారు. మన చట్టం ప్రకారం కొంత మొత్తం డ్రగ్స్‌తో పట్టుబడిన వ్యక్తులు ఎనిమిది మంది నుంచి 15 రోజుల్లో బెయిల్‌పై బయటకు వస్తున్నారని చెప్పుకొచ్చారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడోసారి ముచ్చటగా అరుణ్ జైట్లీ ప్రకటన: చెప్పిందే చెప్పి...