Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచం పట్ల భారత్ ఉదారత... ఔషధాలపై నిషేధం పాక్షికంగా ఎత్తివేత

ప్రపంచం పట్ల భారత్ ఉదారత... ఔషధాలపై నిషేధం పాక్షికంగా ఎత్తివేత
, బుధవారం, 8 ఏప్రియల్ 2020 (11:15 IST)
కరోనా వైరస్ గుప్పెట్లో చిక్కుకుని విలవిల్లాడిపోతున్న ప్రపంచ దేశాలకు తనవంతు చేయూత అందించేందుకు భారత్ ముందుకు వచ్చింది. ఇందులోభాగంగా, కొన్ని జనరిక్ మందుల ఎగుమతిపై కొనసాగుతూ వచ్చిన నిషేధ నిబంధనలను పాక్షికంగా సడలించింది. మలేరియాను నయం చేసేందుకు వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్‌(హెచ్‌సీక్యూ), పారాసెటమాల్‌తో పాటు పలు ఔషధాల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. 
 
దీంతో కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న అమెరికా వంటి దేశాలకు ఊరట లభించినట్టు అయింది. 'కరోనా విశ్వమారి వ్యాపిస్తున్న నేపథ్యంలో మానవతా కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. క్లోరోక్విన్‌, పారాసెటమాల్‌ ఔషధాల కోసం భారత్‌పై ఆధారపడి ఉన్న పొరుగు దేశాలకు ఈ ఔషధాల్ని పరిస్థితులను బట్టి  తగిన మోతాదులో ఎగుమతి చేస్తాం' అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఓ ప్రకటనలో తెలిపారు.
 
కరోనాతో తీవ్రంగా ప్రభావితమై, ఈ ఔషధాల అవసరం ఉన్న దేశాలకు కూడా వీటిని ఎగుమతి చేస్తామన్నారు. దేశీయ అవసరాలకు సరిపడిన నిల్వలు ఉంచుకున్న తర్వాత.. పరిస్థితులకు అనుగుణంగా విడతలవారీగా క్లోరోక్విన్‌ను ఎగుమతి చేస్తామని అధికారులు తెలిపారు. 
 
మరోవైపు, విటమిన్‌ బీ1, బీ12 వంటి 24 ఫార్మా ఔషధాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తివేస్తున్నట్టు కేంద్రం మరో నోటిఫికేషన్‌లో వెల్లడించింది. క్లోరోక్విన్‌కు భారత్‌ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్నది. 
 
కరోనా విశ్వమారిపై పోరాటానికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందన్న వార్తల నేపథ్యంలో గతనెల 25న క్లోరోక్విన్‌తోపాటు పలు ఔషధాల ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించగా, ఇపుడు ప్రపంచ దేశాల విజ్ఞప్తుల మేరకు పాక్షికంగా నిషేధం ఎత్తివేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోడ్లపై తిరుగుతున్న కరోనా రోగులు .. హడలిపోతున్న హిందూపురం వాసులు