ఉత్తరప్రదేశ్‌లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఓ వ్యక్తి చేతిలోని దాదాపు రెండు లక్షల విలువైన ఫోన్ ఎత్తుకెళ్లిపోయింది ఓ కోతి. అంతే ఆ వ్యక్తి పరిస్థితి చెప్పడం మాటల్లో కుదరలేకపోయింది. ఆ కోతి నుంచి ఆ ఫోన్‌ను ఎలా తీసుకోవాలని ఆలోచించాడు. ఇంకా ఆ మంకీ చేతుల్లోంచి ఆ ఫోను లాక్కునేందుకు నానా తిప్పలు పడ్డాడు. అతని చేతిలోని ఫోన్ లాక్కొని వెళ్లిన ఆ వానరం ఎత్తయిన గోడమీద కూర్చుంది.
రూ.లక్ష 50 వేలు పెట్టి కొనుక్కున్న శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ అది. కోతినుంచి ఫోన్ ఎలా దక్కించుకోవాలా అని ఆలోచనలో పడ్డ అతను పక్కనే షాపులో మ్యాంగో డ్రింక్ ప్యాకెట్లు కొన్నాడు. ఆ ప్యాకెట్ పట్టుకొచ్చి కోతి వైపు విసిరాడు. చేతిలో జ్యూస్ ప్యాకెట్ పడగానే కోతి క్యాచ్ ఇట్ అన్నట్టుగా ఫోన్‌ను అతనివైపు విసిరింది.
వెంటనే ఫోన్ అందుకొని హమ్మయ్య అనుకుంటూ అతను అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు కోతుల తెలివితేటలపై సెటైర్లు వేస్తున్నారు.