Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇత్తడి పాత్రలో వేడినీరు.. పడిపోయిన పాపాయి.. చివరికి ఏమైందంటే?

Advertiesment
ఇత్తడి పాత్రలో వేడినీరు.. పడిపోయిన పాపాయి.. చివరికి ఏమైందంటే?
, మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (15:23 IST)
Hot Water
తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని పెరియపాళయంలో వేడినీటిలో నాలుగేళ్ల పాపాయి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. పెరియపాళయంకు సమీపంలో తిరుక్కండలం తలైయారీ వీధికి చెందిన గజేంద్రన్- కుప్పమ్మాళ్ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె వుంది. కుప్పమ్మ పాపాయి స్నానానికి వేడినీళ్లు తోడింది. 
 
ఎప్పటిలాగానే ఆ రోజు కూడా ఇత్తడి పాత్రలో వేడినీటిని బాత్రూమ్‌లో పెట్టి పొయ్యిని ఆఫ్ చేసేందుకు వెళ్లింది. ఆ సమయంలో బాత్రూమ్‌లోకి వెళ్లిన పాప.. వేడినీటిని వుంచిన ఇత్తడి పాత్రలో పడిపోయింది. దీంతో పాప పెద్దగా అరిచిన శబ్ధం విని పరుగులు పెట్టిన కుప్పమ్మ.. బిడ్డను ఆస్పత్రిలో చేర్పించింది. అక్కడ చికిత్స ఫలించక నాలుగేళ్ల పాప ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాధాన్ని మిగిల్చింది. కళ్లముందే వేడినీటిలో పడి పాపాయి విలవిలలాడిన దృశ్యాలు ఆ తల్లిని షాక్ ఇచ్చాయి. ఇంకా తన బిడ్డ ఇక లేదనే నిజాన్ని కుప్పమ్మ జీర్ణించుకోలేక బోరున విలపించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో కరోనా మృతులు 1807 - ప్రమాదకరస్థితిలో వైద్య సిబ్బంది...