పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఓ విస్తుగొలిపే సంఘటన వెలుగు చూసింది. ఇంతకుముందు రోజుకు మూడు నుంచి నాలుగు కండోమ్ ప్యాకెట్లు మాత్రమే అమ్ముడుపోయేవని, ఇప్పుడు స్టోర్‌లో ఒక్క కండోమ్ ప్యాకెట్ కూడా మిగలడం లేదని ఓ మెడికల్ షాపు యజమాని తెలిపాడు.
అనూహ్యంగా పెరిగిన ఫ్లేవర్డ్ కండోమ్‌ల విక్రయాలు స్థానిక దుకాణదారులను కలవరపెడుతున్నాయి. జిల్లాలో కొంత మంది యువకులు వీటిని గర్భనిరోధక సాధనాలుగా కాకుండా మత్తు పదార్థాలుగా ఉపయోగిస్తున్నారని తేలింది.
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో కొంతమంది విద్యార్థులు కండోమ్‌లను ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. వారు కండోమ్‌లను వేడి నీటిలో వేసి, ఆ ద్రవాన్ని తాగుతున్నారు. ఇలా చేయడం వల్ల 10 నుంచి 12 గంటల వరకు మత్తు ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.
కండోమ్స్ డిమాండ్ గణనీయంగా పెరగడంపై స్థానిక యంత్రాంగం ఆందోళన చెందింది. కాగా, ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇంకా స్పందించలేదు.