Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేరళ కన్వెషన్ సెంటర్‌లో పేలుడికి కారణం ఈఐడీనే : పోలీసులు

Advertiesment
kerala blast
, ఆదివారం, 29 అక్టోబరు 2023 (16:55 IST)
కేరళ రాష్ట్రంలోని ఓ కన్వెన్షన్ సెంటరులో ఆదివారం ఉదయం జరిగిన బాంబు పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 40 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ పేలుడు ఈఐడీనే కారణమని కేరళ పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 
 
రాష్ట్రంలోని కలమస్సెరీలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటరులో ఉదయం 9.40కి పేలుడు సంభవించింది. ప్రత్యక్షసాక్షులు చెప్పిన వివరాల ప్రకారం రెండు పేలుళ్లు జరిగినట్లు అంచనా వేస్తున్నాం. భారీ పేలుడు పదార్థం ఐఈడీ కారణంగానే ఇది సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పేలుళ్లకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అని కేరళ డీజీపీ షేక్ దార్వేశ్ సాహెబ్ పేర్కొన్నారు. 
 
ఇందులో ఉగ్రకోణం ఏమైనా ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ దర్యాప్తు తర్వాతే ఏ విషయమైనా చెప్పగలమన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఘటనా స్థలానికి ఎన్ఐతోపాటు ఇతర దర్యాప్తు సంస్థలు చేరుకున్నట్లు కేరళ మంత్రులు వీఎన్ వాసవన్, ఆంటోనీ రాజులు పేర్కొన్నారు.
 
కాగా, ఈ పేలుళ్లలో సుమారు 40 మంది గాయపడగా.. అందులో 10 మంది 50 శాతం కంటే ఎక్కువ కాలిన గాయాలతో చికిత్స తీసుకుంటున్నట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే, ద్వేషపూరిత మెసేజ్లు వ్యాప్తి చేయొద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేలుళ్ల ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. 14 జిల్లాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘటన అనంతరం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. లోతైన దర్యాప్తు కోసం కేంద్ర దర్యాప్తు బృందాలను కూడా ఆయన పంపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్వెన్షన్ సెంటరులో బాంబు పేలుళ్లు... ఒకరి మృతి - 36 మందికి గాయాలు