Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆన్‌లైన్‌లో షవర్మా ఆర్డర్ చేసి తిన్నాడు.. అంతే తిరిగి రాని లోకాలకు..?

shawarma
, గురువారం, 26 అక్టోబరు 2023 (12:23 IST)
ఆన్‌లైన్‌లో షవర్మా ఆర్డర్ చేసి తిన్న యువకుడి పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడు రోజుల పాటు వెంటిలేటర్‌పై అతనికి చికిత్స అందించారు. చివరికి చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. మృతి చెందిన యువకుడి పేరు నాయర్. 24 ఏళ్ల రాహుల్ కొట్టాయం నివాసి. గత బుధవారం కాక్కనాడ్‌లోని ఓ హోటల్‌ నుంచి రాహుల్‌ షవర్మాను ఆర్డర్ చేశాడు. అది తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 
 
యువకుడి ఫిర్యాదుతో హోటల్‌ను మూసివేశారు. ఈ విషయమై ఆరోగ్యశాఖ మంత్రి డీహెచ్‌ఎస్‌ను వివరణ కోరారు. వీలైనంత త్వరగా నివేదిక అందజేయాలని ఆదేశించారు.   
 
మూడు రోజుల క్రితం రాహుల్ పరిస్థితి విషమించింది. దాంతో అతడిని ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ గుండెపోటుకు గురయ్యాడు. అతడి కిడ్నీ పాడైంది. అతని పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. అతని డయాలసిస్ ప్రారంభమైంది. షవర్మా తిన్నాక ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయని డాక్టర్‌తో రాహుల్ చెప్పాడు.
 
రాష్ట్రంలో నిషేధం విధించిన మయోనైజ్‌ను శర్వామాలో వాడారా అనే దానిపై ఆరోగ్య శాఖ విచారణ చేస్తుండగా రాహుల్ మృతి చెందాడు. ఈ కేసులో రసాయన పరీక్షల నివేదిక ఇంకా బయటకు రాలేదు. రాహుల్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్ కొట్టాయం నివాసి. ఆరోపణల నేపథ్యంలో కక్కనాడ్‌లోని లే హయత్ హోటల్‌ను మూసివేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఆంధ్రా వాసుల మృత్యువాత