దేశంలో గృహ హింస చట్టం దుర్వినియోగంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. భర్తలను, వారి కుటుంబసభ్యులను హింసించేందుకు భార్యలు గృహహింస చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో.. ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
భర్తలు, వారి కుటుంబ సభ్యులపై భార్యలు (మహిళలు) పెడుతున్న తప్పుడు కేసులతో ఈ గృహహింస చట్టం దుర్వినియోగమవుతోందని, చాలామంది మహిళలు ఈ చట్టాన్ని తమ స్వార్థానికి వినియోగించుకుంటున్నారు.
తప్పుడు కేసుల ఘటనలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. దీన్ని ఇలాగే వదిలేస్తే… చట్టం మరింత దుర్వినియోగమయ్యే అవకాశం ఉందంటూ ఢిల్లీ ధర్మాసనం పేర్కొంది.
గృహ హింస కేసును విచారిస్తున్న సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. మహిళ జీవించి ఉండగానే ఆమె ఆత్మహత్యకు సంబంధించి కుటుంబసభ్యులు తప్పుడు సమాచారం అందించారని.. ఆ తర్వాత ఆమె అత్తమామలపై కేసు నమోదు చేసి భర్తను అరెస్టు చేశారని పేర్కొంది. ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది.