శ్రీలంకలో పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పిపోయాయి. దీంతో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు విక్రమసింఘే శ్రీలంక సైన్యానికి పూర్తి స్థాయి అధికారాలతో పాటు స్వేచ్ఛను కూడా ఇచ్చారు. ఆందోళనకారులను అవసరమైతే కాల్చిపారేసి పరిస్థితిని అదుపులోకి తీసుకరావాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశంలో ఎమర్జెన్సీని విధించిన నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడేందుకు, ఆర్మీకి పూర్తి అధికారాలు ఇచ్చారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఏది అవసరమైతే అది చేయాలని, అవసరమైతే కనిపించిన వారిని కాల్చిపడేయాలని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా, దేశం ఫాసిస్టుల చేతిల్లోకి ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాత్కాలిక అధ్యక్షుడుగా తాను తప్పుకునే ప్రయత్నం చేయాలని ఆందోళనకారులు చూస్తున్నారని మండిపడ్డారు.