Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరదలో చిక్కుకున్న ఏనుగు, మావటి.. ఇలా బయటపడ్డారు.. వైరల్

Advertiesment
Elephant
, బుధవారం, 13 జులై 2022 (20:24 IST)
Elephant
బీహార్‌లోని వైశాలి జిల్లా రాఘవ్‌పూర్‌లో గంగానది పరవళ్లు తొక్కుతుంది. ఈ వరద నుంచి ఓ ఏనుగు, మావటి బయటపడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. తొలుత ప్రవాహాన్ని తక్కువగా అంచనా వేసిన మావటి.. ఏనుగును ఒడ్డుకు చేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో వరద ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయారు. తల వరకు నీటమునిగిన ఆ ఏనుగు నదిలో సుమారు మూడు కిలోమీటర్లు ఈదింది.
 
చివరకు ఒక చోట నది మలుపు కన్పించడంతో మావటివాడు ఆ దిశగా ఏనుగు ఈదేలా చేశాడు. దీంతో ఏనుగు, మావటివాడు నది ప్రవాహం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైకుల కంటే ప్రాణాలే ముఖ్యం.. ఈ వీడియో చూస్తే..? (Video)