Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అద్దెకు ఇంటినిస్తే.. తల్లీకూతుళ్లపై ఇద్దరు సోదరుల అత్యాచారం..

Advertiesment
rape
, మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (23:42 IST)
గుజరాత్‌లోని వడోదరలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అద్దెకు వుంటున్న ఇద్దరు సోదరులు.. తమ యజమాని భార్యతోపాటు ఆమె కుమార్తెను బ్లాక్​ మెయిల్​ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. నిందితులిద్దరిని అరెస్ట్​ చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. నగరంలో మోను అన్సారీ, మహోరామ్​ అన్సారీ అనే ఇద్దరు సోదరులు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అయితే తమ ఇంటి యజమాని భార్యపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు మోనూ అన్సారీ. ఆ తర్వాత డబ్బులు కూడా డిమాండ్​ చేశాడు. బ్లాక్​ మెయిల్​ చేస్తూ రెండున్నరేళ్ల పాటు అనేక సార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత యజమాని కుమార్తెపై కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఇవి తెలుసుకున్న మహోరామ్​ అన్సారీ.. తల్లీకూతుళ్లను బ్లాక్​ మెయిల్​ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరకు వీరి ఆగడాలు భరించలేక యజమాని భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్‌బిలియన్‌ డేస్‌ 2022, భారీ డిస్కౌంట్లతో క్లియర్‌ ట్రిప్‌