Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీపై తీవ్ర వ్యతిరేకత... నేతల్లో గుబులు

భారతీయ జనతా పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ హవాతో తిరుగులేని మెజార్టీతో గెలిచి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ గత ఎన్నికల్లో 282 స్థాన

Advertiesment
బీజేపీపై తీవ్ర వ్యతిరేకత... నేతల్లో గుబులు
, ఆదివారం, 10 జూన్ 2018 (10:28 IST)
భారతీయ జనతా పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ హవాతో తిరుగులేని మెజార్టీతో గెలిచి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ గత ఎన్నికల్లో 282 స్థానాలు గెలుచుకుంది. అయితే, వచ్చే ఎన్నికల్లో మాత్రం తమ పార్టీకి ఎదురుదెబ్బ తగలనుంది. ఈ మేరకు బీజేపీ నిర్వహించిన ఓ సర్వేలో తేలినట్టు సమాచారం. గత ఎన్నికల్లో గెలిచిన 282 స్థానాల్లో కనీసం 152 నియోజక వర్గాల్లో ఓటర్లు బీజేపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నట్టు ఈ సర్వే చెబుతోంది.
 
దీంతో ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలనుకాకుండా కొత్తవారిని పోటీలోకి దించాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఢిల్లీలో జరిగిన మూడు నగరపాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అనేక స్థానాల్లో కొత్తవారిని పోటీకిదింపి విజయం సాధించింది. దీంతో ఆ ప్రయోగాన్నే వచ్చే ఎన్నికల్లోనూ చేయాలనుకుంటోంది. 
 
75 ఏళ్లు నిండిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని గతంలో బీజేపీ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు ఆ నిబంధనను తొలగిస్తున్నారు. తనకు పట్టున్న రాష్ట్రాల్లోనేకాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల నుంచి మరిన్ని సీట్లు గెలుచుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటకలో శాఖల చిచ్చు.... కుమారస్వామిపై మంత్రుల గుర్రు