Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీటెక్ బంగారు బాతుగుడ్డు కాదు, 6 నెలలకే ఔట్: 700 మందిని ఇన్ఫోసిస్ ఊస్టింగ్

Advertiesment
Un-employment

ఐవీఆర్

, సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (22:26 IST)
బీటెక్. ఒకప్పుడు మా అబ్బాయి/అమ్మాయి బీటెక్ చదువుతోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది అని గొప్పగా చెప్పుకునేవారు తల్లిదండ్రులు. ఇప్పుడు అది రివర్స్ అవుతోంది. ఏడాదికి దేశంలో లక్షల మంది బీటెక్ పట్టభద్రులు బయటకు వచ్చేస్తున్నారు. కానీ వారికి తగినట్లుగా కంపెనీల్లో ఉద్యోగాల కల్పన రావడంలేదు. పైగా ప్రతి ఒక్కరూ బీటెక్ అనేది బంగారు బాతుగుడ్డు లాంటిదని ఎగబడి చదవడం ఎక్కువైంది. దీనితో పోటీ ఎక్కువై ఆ విభాగంలో ఉద్యోగాలు రావడం కష్టతరంగా మారిపోతోంది. ఇందుకు తాజా ఉదాహరణే ఇన్ఫోసిస్ 700 మంది ట్రైనీ ఉద్యోగులను ఉన్నఫళంగా 6 నెలలు కూడా తిరగక ముందే ఇంటికి సాగనంపింది.
 
ఉద్యోగాలను కోల్పోయిన కొంతమంది యువతీయువకులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగాక తాము 2 ఏళ్లపాటు ఉద్యోగం కోసం ఎదురుచూసామనీ, గత ఏడాది సెప్టెంబరు నెలలో కాల్ లెటర్స్ అందుకుని ఎంతో సంతోషించామన్నారు. ఐతే 6 నెలలు తిరగకుండానే మీకు ఉద్యోగం లేదంటూ ఇంటికి వెళ్లమని చెప్పడంతో తమ పేరెంట్స్ కి ఏం చెప్పాలో అర్థం కావడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మొత్తమ్మీద బీటెక్ చదివిన, చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు ఇది ఒక నిదర్శనంగా మారుతోంది. కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగం మాత్రమే కాకుండా ఇతర విభాగాల్లోనూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత వున్నదని గుర్తించాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ.. ప్రజలు చికెన్ తినొద్దు..