Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెజాన్ బజార్‌పై ప్యార్ బజార్ సెలక్షన్, మీరు కోరుకునేవి అన్నీ కొనుగోలు చేయండి

Advertiesment
Amazon

ఐవీఆర్

, సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (20:26 IST)
ఈ వాలెంటైన్స్ డేని మరింత ప్రత్యేకం చేసుకోండి, మరింత అందుబాటు ధరలో అమెజాన్ డాట్ ఇన్‌లో కొత్త స్టోర్ ఫ్రంట్ అయిన అమెజాన్ బజార్లో పొందండి. ఈ స్టోర్ బజార్ ఫ్యాషన్, గృహాలంకరణ, వంటగది ఉత్పత్తులు, ఫోన్ యాక్సెసరీలపై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తుంది. చక్కని రొమాంటిక్ డేట్‌కు సొబగులు అద్దేందుకు మెరిసే జ్యువలరీ మొదలుకుని, మీ V-డే అలంకరణకు వ్యక్తిగత అభిరుచిని తెలియచెప్పే మనసును హత్తుకునే గృహాలంకరణ సామాగ్రి వరకు మీరు ప్రేమించే వారితో కోరుకునే చక్కని వాలెంటైన్స్ డే కోం కావలసినవి అన్నీ అమెజాన్ బజార్ వారి ప్రత్యేకంగా రూపొందించిన ప్యార్ బజార్ విభాగంలో లభిస్తాయి, కేవలం రూ. 99తో ప్రారంభం.
 
అమెజాన్ బజార్‌తో, బడ్జెట్‌ను గురించి జాగ్రత్త వహించే షాపర్లు కూడా ఫ్రీ డెలివరీ, డెలివరీ లభించిన తర్వాత చెల్లింపు, ఇబ్బందులు లేని 5 రోజుల రిటర్న్‌ల సౌకర్యాలను పొందవచ్చు. UPI చెల్లింపులపై అదనంగా క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా మీరు పొందవచ్చు. "అమెజాన్‌లో, మా కస్టమర్ల కోసం మేము మరింత ఎక్కువ విలువను అందించేందుకు మార్గాలను నిరంతరం అన్వేషిస్తూ ఉంటాము. అమెజాన్ బజార్‌తో, అన్ని ఉత్పత్తులపై భారీగా తగ్గింపు ధరలను అందించటం మాకు ఎంతో ఉత్కంఠను కలిగిస్తోంది. ప్రత్యేకమైన వ్యాలెంటైన్స్ డే కోసం మేము సెలక్షన్‌ను రూపొందించాము. ప్యార్ బజార్ బడ్జెట్ గురించి జాగ్రత్త వహించే మా కస్టమర్ల కోసం. డ్రెస్‌లు, షర్ట్‌లు, జీన్స్, జ్యువలరీ, సాఫ్ట్ టాయ్స్, ఫోన్ యాక్సెసరీలు, అలంకరణ సామాగ్రి, ప్రతి కస్టమర్ కోసం ఏదో ఒకటి ఉన్నది. అవి నిజంగా బహుమతులను అందుబాటు ధరల్లో ఉండేట్లుగాను, వినోదభరితంగాను చేస్తాయి,” అని జహీద్ ఖాన్ డైరెక్టర్, సెంట్రల్ షాపింగ్ ఎక్స్­పీరియన్స్, అమెజాన్ ఇండియా అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Traffic: మహా కుంభ మేళాలో ట్రాఫిక్ రికార్డ్.. గంగమ్మలో కోట్లాది మంది మునక.. కాలుష్యం మాట?