Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీనియర్ సిటిజన్ల కోసం ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ప్రత్యేక ప్యాకేజీ పరిచయం

Advertiesment
image

ఐవీఆర్

, శనివారం, 8 ఫిబ్రవరి 2025 (12:11 IST)
సమాజంలోని వయోధికుల వినూత్న ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రత్యేకమైన బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలను ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఆవిష్కరించింది. ఈ ఆఫర్‌లలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ఖాతా, సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ ముఖ్యమైన  కస్టమర్ విభాగానికి ఉన్నతమైన, సురక్షితమైన, అనుకూలీకరించిన ఆర్థిక పరిష్కారాలను అందించడానికి బ్యాంక్ నిబద్ధతను ఇది  పునరుద్ఘాటిస్తుంది. ఈ కార్యక్రమం కింద, బ్యాంక్ తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో 'సీనియర్ సిటిజన్ స్పెషల్స్' అనే ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సీనియర్ సిటిజన్లకు ఈ దిగువ ప్రయోజనాలను అందిస్తుంది.
 
వారి జీవిత దశ ఆధారంగా సీనియర్ సిటిజన్ల అవసరాలకు వర్తించే విధంగా సురక్షితమైన, భద్రమైన, అనుకూలీకరించిన పెట్టుబడి పరిష్కారాలు.
ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై అదనపు 0.5% వడ్డీ రేటు.
FDల ముందస్తు మూసివేతపై ఎటువంటి జరిమానా లేదు.
పెరుగుతున్న సైబర్ దాడుల నుండి మన సీనియర్ సిటిజన్లను రక్షించడానికి రూ. 2 లక్షల సైబర్ బీమా కవరేజ్.
నలుగురు కుటుంబ సభ్యుల వరకు అపరిమిత ఉచిత డాక్టర్ వీడియో సంప్రదింపులతో ఒక సంవత్సరం ఉచిత మెడిబడ్డీ ఆరోగ్య సభ్యత్వం.
నెట్‌వర్క్ ఫార్మసీలలో 15% వరకు తగ్గింపు, 50+ ప్రమాణాలను కవర్ చేసే పూర్తి శరీర ఆరోగ్య పరీక్షలు, రూ. 500 వాలెట్ బ్యాలెన్స్‌ను పొందవచ్చు.
మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఆవిష్కరణ, పరిశోధనల ద్వారా మద్దతు ఇవ్వబడిన సరళీకృత మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి అనుభవాన్ని కూడా అందిస్తుంది. ఈ MF ఆఫర్లు సాంప్రదాయికమైనవి, సీనియర్ సిటిజన్లు వారి స్వంత రిస్క్-రివార్డ్ స్వీకరణ ఆధారంగా సవరించవచ్చు.
 
సీనియర్ సిటిజన్ల కోసం బ్యాంక్ ఆఫర్‌లపై రిటైల్ లయబిలిటీస్- బ్రాంచ్ బ్యాంకింగ్ కంట్రీ హెడ్-శ్రీ చిన్మయ్ ధోబ్లే మాట్లాడుతూ, “మేము మా సీనియర్ సిటిజన్లను ప్రత్యేకంగా పరిగణించాలనుకుంటున్నాము. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకమైన, వినూత్నమైన ఆఫర్‌లను ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము.
 
మా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ఖాతా సాధారణంగా పొదుపు ఖాతాలపై విధించబడే 30కి పైగా ఛార్జీలను తొలగిస్తుంది. అదనంగా, మా గౌరవనీయ సీనియర్ సిటిజన్ల కోసం మేము చాలా ప్రత్యేకమైన ప్యాకేజీని అందిస్తున్నాము, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అకాల బ్రేకేజ్ పెనాల్టీ లేదు, ఆరోగ్య ప్రయోజనాలు, సైబర్ బీమా, సీనియర్ల కోసం అనుకూలీకరించిన ప్రత్యేక యాప్ వంటివి అందిస్తున్నాము. ఇది మా సీనియర్లకు నచ్చుతుందని, ఇది వారు మాకు అందించిన సహకారానికి నివాళిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. రామ్ గోపాల్ వర్మపై కేసు.. సీఐడీ నోటీసులు