Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమారుడి కోసం.. తల్లీకూతుళ్లపై యాసిడ్ పోసిన తండ్రి.. ఎక్కడ?

Advertiesment
కుమారుడి కోసం.. తల్లీకూతుళ్లపై యాసిడ్ పోసిన తండ్రి.. ఎక్కడ?
, మంగళవారం, 29 జనవరి 2019 (15:53 IST)
ప్రేమిస్తున్నానంటూ వెంటపడి, ఒప్పుకోకపోతే యాసిడ్ దాడులు చేసిన ప్రేమికులను ఇప్పటివరకు మనం చూస్తూ వచ్చాం, కానీ తాజాగా పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఓ ఘటన ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రియురాలిపై ప్రియుడి తండ్రి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. మసలంద్ పూర్ జిల్లా రాజ్‌బలపూర్‌కు చెందిన అబ్దుల్ సత్తార్ కుమారుడు గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అతడిని తండ్రి ఎన్నిసార్లు మందలించినా కూడా వినలేదు. తండ్రి వారించడంతో బాధపడుతూ గతవారం కుమారుడు ఇళ్లు వదలి వెళ్లిపోయాడు. దీంతో కలత చెందిన తండ్రి ఆగ్రహంతో తన కొడుకు ప్రియురాలి ఇంటికి చేరుకున్నాడు. 
 
తలుపులు తీయాలంటూ గట్టిగా కేకలు వేసాడు. లోపలికి వెళ్లిన అతడు అమ్మాయితో పాటు ఆమె తల్లిపై యాసిడ్ దాడికి దిగాడు. తల్లీ కూతుళ్ల అరుపులు, కేకల విన్న చుట్టు పక్కల వారు వెంటనే అక్కడ గుమిగూడారు. ఇరువురినీ హస్పిటల్‌కి తరలించారు. దాడిలో అమ్మాయి కళ్లు బాగా దెబ్బతిన్నాయి, ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
 
మరోవైపు దాడికి పాల్పడ్డ సత్తార్‌కి కూడా గాయాలు కావడంతో అతడికి కూడా చికిత్సను అందిస్తున్నారు. వీరందరికీ బారాసత్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది, చికిత్సానంతరం పోలీసులు ముగ్గురినీ బారాసత్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరీఫ్ సీజన్.. ఏపీకి రూ.900 కోట్లు.. కంటి తుడుపు చర్యేనా?