మహారాష్ట్ర లోని పర్బాని జిల్లాలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పనిచేస్తున్నాడు సచిన్ మిట్కారీ. సరిగ్గా నాలుగు నెలల క్రితమే అతనికి వివాహమైంది.
సంసార జీవితాన్ని ప్రశాంతంగా అనుభవిస్తున్నాడు. అయితే ఇంతలో అతనితో పాటు పనిచేసే ఒక నర్సు సచిన్‌ను లైంగికంగా వేధించడం మొదలుపెట్టింది. అనారోగ్యంతో తన భర్త మరణించడంతో నర్సు సచిన్ పైన మోజు పెంచుకుంది. పెళ్ళికి ముందు నుంచి సచిన్ పైన మనస్సు పడింది నర్సు.
కానీ సచిన్ అప్పట్లో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ పెళ్ళయిన తరువాతి నుంచి నర్సులో మార్పు కనిపించింది. స్ట్రెచర్ పైన పడుకుని శృంగారం చేద్దాం రా అంటూ ఆమె అసభ్యంగా ప్రవర్తించేది. దీంతో చాలాసార్లు ఆమె నుంచి తప్పించుకున్నాడు సచిన్ మిట్కారీ.
కానీ నర్సు రివర్సులో... నీపై నేనే లైంగిక కేసు పెట్టి అరెస్టు చేయిస్తా.. నీ ఉద్యోగం పోతుందని బెదిరించిందట. కొత్తగా పెళ్ళయి ఉద్యోగం పోతే ఎలా బతకాలని అతను తనలో తానే ఆవేదనకు గురయ్యాడు. ఇంట్లో భార్య కూరగాయల కోసం బయటకు వెళితే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనాడో స్పష్టంగా లేఖలో రాశాడు సచిన్. పోలీసులు ఆ లేఖను స్వాధీనం చేసుకుని నర్సును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.