Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకినావా ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలపై పండుగ ఆఫర్, నవంబర్ 15 వరకూ...

Advertiesment
ఒకినావా ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలపై పండుగ ఆఫర్, నవంబర్ 15 వరకూ...
, గురువారం, 29 అక్టోబరు 2020 (21:21 IST)
‘‘మేక్ ఇన్ ఇండియా’’పై దృష్టి సారించే భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీ కంపెనీ అయిన ఒకినావా ఈ సీజన్‌ల తన కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. పండుగ సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని ఒకినావా ఒక లక్కీడ్రాని ప్రకటించింది. డ్రా ద్వారా 10 మంది కొనుగోలుదారులు కేవలం రూ. 30లకే ఒకినామా స్లో స్పీడ్ స్కూటర్‌ని ఇంటికి తీసుకెళ్లే లక్కీ గిఫ్ట్‌ని పొందుతారు.
 
ఈ ఆఫర్ అక్టోబర్ 24, 2020 నుంచి నవంబర్ 15, 2020 వరకు చెల్లుబాటు అవుతుంది. లక్కీ డ్రా ఫలితాలు నవంబర్ 30, 2020 నాడు ప్రకటించబడతాయి. ప్రతి ఖాతాదారుడితో పండుగ వేడుకల్ని పంచుకోవడానికి బ్రాండ్ ప్రతి బుకింగ్‌పై తప్పని బహుమతులను సైతం ప్రకటించింది. దీనికి అదనంగా, కొనుగోలుదారులు వారి ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ బుకింగ్‌ల కొరకు రూ. 6000 విలువైన గిప్ట్ ఓచర్‌లను కూడా పొందుతారు. తన ఖాతాదారులకు మరింత సౌకర్యవంతంగా వాహనాలను బుక్ చేయడం కొరకు బ్రాండ్ ఇటీవల తన వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ లాంఛ్ చేసింది.
 
ఒకినావా డిజిటల్ ఫ్లాట్‌ఫారం ద్వారా, కొనుగోలుదారులు అనేక ఆప్షన్‌ల నుంచి కస్టమ్ థీమ్ పెయింటెడ్ స్కూటర్‌లను కూడా ఎంచుకోవచ్చు. ప్రత్యేక ధీమ్‌లు ప్రొఫెషనల్ ఆర్టిస్టుల ద్వరా అత్యధిక నాణ్యత కలిగిన పెయింట్‌లు ఉపయోగించి డిజైన్ చేయబడ్డాయి.
 
“కరోనా మహమ్మారి కారణంగా, ఆటోమొబైల్ రంగంతో సహా అనేక ఇండస్ట్రీల్లో మందగమనాన్ని ఎదుర్కొన్నాయి. అయితే, లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత, మా ఖాతాదారుల నుంచి మాకు భారీగా ప్రతిస్పందన లభించింది. ఇప్పుడు ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, తమ వ్యక్తిగత వాహనాల విషయంలో EVలకు మొగ్గు చూపుతున్నారు.
 
సమాజంలో ICE నుంచి EV వైపు భారీగా మొగ్గు చూపడం అనేది ఖచ్చితంగా గుర్తించాల్సిన విషయం. కాలుష్యరహిత దేశం అనే భారీలక్ష్యం దిశగా మనందరం కలిసి ముందుకు సాగేందుకు అదే స్ఫూర్తిని ఖాతాదారులతో పంచుకునేందుకు ఒకినావా అందించే ఆఫర్లు ఉద్దేశించబడ్డాయని, ”శ్రీ. జితేందర్ శర్మ, ఎమ్‌డి, ఒకినావా అన్నారు. కొనుగోలుదారుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన అవగాహన పెరగడం వల్ల ఈ పండుగ సీజన్‌ల్లో వీటి అమ్మకాలు 40% పెరుగుతుందని ఒకినావా ఆశిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో ఆటోమొబైల్‌ సేవా ప్రదాత గో మెకానిక్‌ సరికొత్త స్పేర్‌పార్ట్స్‌ ఫ్రాంచైజీ ఔట్‌లెట్‌