Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్వార్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం : ఐదుగురి మృతి

Advertiesment
అల్వార్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం : ఐదుగురి మృతి
, ఆదివారం, 15 ఆగస్టు 2021 (16:04 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో ఆదివారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఓ కారు ముందుగా వెళ్తున్న సిమెంట్ లారీని బ‌లంగా ఢీకొట్ట‌ింది. ఈ ప్రమాదంలో కారులోవున్న 8 మందిలో ఐదుగురు అక్కడిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు కావ‌డంతో చికిత్స నిమిత్తం అల్వార్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 
 
ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం 5.30 గంట‌ల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. మొత్తం ఐదు సీట్ల కెపాసిటీగ‌ల కారులో మొత్తం 8 మంది ఉన్నార‌ని, ప్ర‌మాదంలో ఆ కారులోని ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందార‌ని పోలీసులు చెప్పారు. 
 
మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు కావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. కారులోని వారు క‌థుమార్‌లో గోవ‌ర్ధ‌న్ ప‌రిక్ర‌మ నిర్వ‌హించి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశ భక్తిని చాటిన కరీంనగర్ జిల్లా రైతు.. పొలంలోనే స్వతంత్ర్య వేడుకలు