Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాట్సాప్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్...

మేషం: ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వలన పై అధికారుల చేత మాటపడవలసి వస్తుంది. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల విషయాల్లో ఏకాగ్రత ముఖ్యం. స్వతంత్య్ర నిర్ణయాలు తీసుకొనుట వలన శుభం చేకూరగల

వాట్సాప్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్...
, శనివారం, 21 జులై 2018 (08:50 IST)
నిజంగా ఇది వాట్సాప్ వినియోగదారులకు దుర్వార్తే. ఇకపై తమ వాట్సాప్ నంబరుకు వచ్చే సందేశాలు లేదా వీడియోలను కేవలం ఐదుగురికి మాత్రమే ఫార్వర్డ్ చేయగలుగుతారు. అంతకుమించి సాధ్యపడదు. ఈ మేరకు వాట్సాప్‌ యాప్‌లో పలు మార్పులు చేయనున్నారు. ముఖ్యంగా, ఫార్వర్డ్ ఐకాన్‌ను తొలగించనున్నారు.
 
సామాజిక, సందేశ మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందుతున్న వదంతులు, తప్పుడు వార్తల వల్ల గత రెండు నెలల్లో సుమారుగు 20 మందికి పైగా చనిపోయారు. పిల్లల కిడ్నాపర్లుగా భ్రమించి, అపరిచిత వ్యక్తులను స్థానిక వ్యక్తులు కొట్టి చంపుతున్నారు. ఈ తరహా ఘటనలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇవి కలకలం రేపుతున్నాయి. వీటిపై బాధ్యత తీసుకోవాలని ఆయా మాధ్యమాల సంస్థలను కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో వాట్సాప్‌ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 
 
ఇక నుంచి ఒకేసారి ఐదుగురికి మాత్రమే సందేశాలను ఫార్వర్డ్‌ చేసేలా నియంత్రించనుంది. సులభంగా సందేశం పంపేందుకు గల ఫార్వర్డ్‌ ఐకాన్‌ను తొలగిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వాట్సాప్‌ను దుర్వినియోగపరచకుండా తాము తీసుకుంటున్న చర్యలను ఎన్నికల సంఘానికి వివరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోదీ సర్కారుపై వీగిపోయిన అవిశ్వాసం... అనుకూలం 126, వ్యతిరేకం 325