Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సామ్‌సంగ్ ఎడ్యుకేషన్ హబ్ యాప్‌లో ఎంబైబ్ ఏఐ పవర్డ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఇంటిగ్రేట్ చేసిన సామ్‌సంగ్

Advertiesment
Samsung Education Hub App

ఐవీఆర్

, శుక్రవారం, 31 జనవరి 2025 (23:06 IST)
గురుగ్రామ్: భారతదేశ అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్ ఏఐ ఆధారిత వ్యక్తిగతీకరించిన అభ్యాస ఫలితాల వేదిక అయిన ఎంబైబ్ తో భాగస్వామ్యం కుదుర్చు కుంది, దీనిని టీవీ కోసం రూపొందించిన విద్యా యాప్ అయిన సామ్‌సంగ్ ఎడ్యుకేషన్ హబ్ యాప్‌లో అనుసంధానించింది. ఈ భాగస్వామ్యం టీవీలు విద్యార్థులకు వ్యక్తిగతీకరించిన అభ్యాస అనుభవాలను అందించే ప్రభావవంతమైన విద్యా సాధనాలుగా మారడానికి సహాయపడుతుంది.
 
ఈ భాగస్వామ్యం ద్వారా సామ్‌సంగ్ ఎడ్యుకేషన్ హబ్ యాప్‌లో భాగంగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జ్, అన్ని రాష్ట్ర బోర్డులు, ఐఐటీ జేఈఈ, నీట్ వంటి ప్రధాన ప్రవేశ పరీక్షలతో సహా అన్ని ప్రధాన పాఠ్యాంశాలకు మద్దతు ఇస్తూ విస్తృతమైన విద్యా కవరేజీని ఎంబైబ్ అందిస్తుంది. అత్యంత సంక్లిష్టమైన అంశాలను కూడా సులభంగా అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి మరింత ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించబడిన ప్రసిద్ధ లీనమయ్యే త్రీడీ వివరణాత్మక వీడియోల భారీ కలెక్షన్ నుండి విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.
 
‘‘సామ్‌సంగ్ ఎడ్యుకేషన్ హబ్ యాప్ ఇళ్లలో టీవీల పాత్రను విస్తరిస్తుంది. వాటిని కేవలం వినోద కేంద్రాల నుండి ఆన్‌లైన్ అభ్యాసానికి సజావుగా ఉండే వేదికగా మార్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వినూత్నమైన 'టీవీ కోసం రూపొందించిన' విద్యా యాప్ ఆన్‌లైన్ అభ్యాస అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి సిద్ధంగా ఉంది. ఇది అందరికీ ఆకర్షణీయంగా, అందుబాటులో ఉంటుంది. విద్యకు సరిహద్దులు లేని, ఒక బటన్ క్లిక్‌తో జ్ఞానం సులభంగా చేరుకోగల భవిష్యత్తును సృష్టించడమే మా ఆశయం’’ అని సామ్‌సంగ్ ఇండియా విజువల్ డిస్‌ప్లే బిజినెస్ సీనియర్ డైరెక్టర్ విప్లవేష్ డాంగ్ అన్నారు.
 
‘‘సామ్‌సంగ్ టీవీతో మా భాగస్వామ్యం అత్యంత విశ్వసనీయమైంది. మనం ఇష్టపడే మాధ్యమాలలో ఒకదాని ద్వారా నిజంగా వ్యక్తిగతమైన, ఆకర్షణీయమైన, అభ్యాస అనుభవాన్ని అందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగును ఇది సూచిస్తుంది. అద్భుతమైన ఇంటరాక్టివ్, మల్టీ-మోడల్ కంటెంట్‌ను సృష్టించడం, ఏఐ ద్వారా లోతైన వ్యక్తిగతీకరించిన అనుభవం ద్వారా దానిని అందించడం అనే రెండు క్లిష్టమైన సవాళ్లను మేం పరిష్కరించి నందున సామ్‌సంగ్ ఎంబైబ్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సామ్‌సంగ్ వినూత్నత, ఎంబైబ్ ఎడ్ టెక్ నైపుణ్యం మిళితం అనేది విద్యా నైపుణ్యానికి కొత్త ప్రమాణాన్ని నిర్దేశించే శక్తివంతమైన కలయిక. ఇది ప్రతి ఒక్కరికీ పరివర్తనాత్మక అభ్యాస అనుభవాన్ని సృష్టిస్తుంది’’ అని ఎంబైబ్ వ్యవస్థాపకురాలు, సీఈఓ అదితి అవస్థి అన్నారు.
 
ఎంబైబ్ అందించే ప్రధాన లక్ష్యం దాని వ్యక్తిగతీకరించిన, ఏఐ ఆధారిత అనుకూల అభ్యాసం. ఇది ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయికి అనుగుణంగా ఉంటుంది.  సామ్‌సంగ్ ఎడ్యుకేషన్ హబ్ ద్వారా, విద్యార్థులు ఎంబైబ్ వీడియో ఆధారిత అభ్యాస వనరులను, ఇంగ్లీష్, హిందీ, పది ప్రధాన ప్రాంతీయ భాషలలో దాని ఏఐ ఆధారిత అనుకూల అభ్యాసాన్ని యాక్సెస్ చేయగలరు. దీనికి రెండు కోట్లకు పైగా విద్యార్థుల పది సంవత్సరాల విద్యా నిమగ్నత డేటా మద్దతు ఇస్తుంది. విద్యార్థులు 54 వేల ప్రాక్టీస్ పరీక్షల నుండి ఎంచుకోవచ్చు. మెరుగుదల కోసం ఉపయోగకరమైన ఇన్ సైట్స్‌ను అందించే వ్యక్తిగతీకరించిన స్కోర్-మెరుగుదల ఫీచర్లను ఉపయోగించవచ్చు. అంతేగాకుండా, విద్యార్థులు టీవీలో కొనుగోలు చేసిన ఎంబైబ్ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌పై సామ్‌సంగ్ యొక్క 50% ప్రత్యేక తగ్గింపును పొందవచ్చు.
 
ఎంబైబ్ కంటెంట్ అన్ని 2024 సామ్‌సంగ్ టీవీలు, స్మార్ట్ మానిటర్లలో అందుబాటులో ఉంటుంది. క్రమంగా మునుపటి మోడళ్లలో అందుబాటులోకి వస్తుంది. సామ్‌సంగ్ టీవీలను కలిగి ఉన్న ఎంబైబ్ ప్రస్తుత సబ్‌స్క్రైబర్లు, ప్లాట్‌ఫామ్‌కు సభ్యత్వాన్ని పొందాలనుకునే సామ్‌సంగ్ టీవీ వినియోగదారులతో పాటు, ఈ గొప్ప విద్యా కంటెంట్‌‌కు సజావుగా లాగిన్ అవ్వడం, యాక్సెస్‌ను కలిగి ఉంటారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, సామ్‌సంగ్ 2023, 2024  సామ్‌సంగ్ టీవీలలో సామ్‌సంగ్ ఎడ్యుకేషన్ హబ్ కోసం ప్రముఖ ఎడ్ టెక్ ప్లాట్‌ఫామ్ ఫిజిక్స్ వాలాతో జట్టు కట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య