Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌ను విడుదల చేసిన సామ్‌సంగ్ ఇండియా

Advertiesment
Galaxy S25 Series

ఐవీఆర్

, సోమవారం, 27 జనవరి 2025 (21:25 IST)
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్ , నేడు వినియోగదారులు తమ తాజా గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 25+, గెలాక్సీ ఎస్ 25 స్మార్ట్‌ఫోన్‌లను ముందస్తు ఆర్డర్ చేయవచ్చని ప్రకటించింది, ఇవి సామ్‌సంగ్ ఇప్పటివరకు సృష్టించిన అత్యంత సహజమైన, సందర్భోచిత మొబైల్ అనుభవాలతో నిజమైన ఏఐ కంపానియన్‌గా కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తాయి.
 
గెలాక్సీ ఎస్25 సిరీస్ ఏఐ ఏజెంట్లు, మల్టీమోడల్ సామర్థ్యాలను సజావుగా మిళితం చేయటం ద్వారా ప్రతి టచ్‌పాయింట్‌లో వినియోగదారులు అనుసంధానించే విధానాన్ని మార్చాలనే సామ్‌సంగ్ లక్ష్యంలో మొదటి అడుగును సూచిస్తుంది. గెలాక్సీ చిప్‌సెట్ కోసం మొట్టమొదటిసారిగా  అనుకూలీకరించిన స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ ప్లాట్‌ఫామ్ గెలాక్సీ ఏఐ కోసం అత్యున్నత ఆన్-డివైస్ ప్రాసెసింగ్ శక్తిని, గెలాక్సీ యొక్క తదుపరి తరం ప్రో విజువల్ ఇంజిన్‌తో ఉన్నతమైన కెమెరా పరిధి, నియంత్రణను అందిస్తుంది.
 
“గత సంవత్సరం గెలాక్సీ ఏఐ ని విడుదల చేయటంతో సామ్‌సంగ్ మొబైల్ ఏఐ యుగాన్ని ఆవిష్కరించింది. మేము ఇప్పుడు గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌తో గెలాక్సీ ఏఐ యొక్క తదుపరి అధ్యాయాన్ని తీసుకువచ్చాము, ఇది మీ నిజమైన ఏఐ కంపానియన్. గెలాక్సీ ఎస్25 సిరీస్ మీకు అత్యంత సందర్భోచితమైన, వ్యక్తిగతీకరించిన ఏఐని అందిస్తుంది, తద్వారా మీరు వ్యక్తిగత గోప్యతకు హామీ ఇవ్వబడి, అనుకూలమైన, కార్యాచరణకు తగిన పరిజ్ఙానంను పొందవచ్చు. కొత్త గెలాక్సీ ఎస్25 సిరీస్ మా నోయిడా ఫ్యాక్టరీలో తయారు చేయబడుతుందని వెల్లడించేందుకు నేను సంతోషిస్తున్నాను” అని సామ్‌సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా అధ్యక్షుడు మరియు సీఈఓ జె బి పార్క్ అన్నారు.
 
సామ్‌సంగ్ యొక్క ఏఐ -మొదటి ప్లాట్‌ఫారమ్ అయిన వన్ యుఐ7 తో వచ్చే మొదటి స్మార్ట్‌ఫోన్ సిరీస్, గెలాక్సీ ఎస్25 సిరీస్. ఇది అత్యంత సహజమైన నియంత్రణలను అందించడానికి రూపొందించబడిన ఏఐ -ఆధారిత,  వ్యక్తిగతీకరించిన మొబైల్ అనుభవాలను అనుమతిస్తుంది. మల్టీమోడల్ సామర్థ్యాలతో కూడిన ఏఐ ఏజెంట్లు గెలాక్సీ ఎస్ 25 సిరీస్ సహజంగా అనిపించే పరస్పర చర్యల కోసం టెక్స్ట్, ప్రసంగం, చిత్రాలు మరియు వీడియోలను అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి.

గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌తో, మీరు తదుపరి దశల కోసం సందర్భోచితమైన సూచనలతో కార్యాచరణ శోధనలను కూడా చేయవచ్చు. అంతేకాకుండా, GIFని పంచుకోవడం లేదా ఈవెంట్ వివరాలను సేవ్ చేయడం వంటి శీఘ్ర తదుపరి చర్యల కోసం యాప్‌ల మధ్య మారడం కూడా సులభంగా జరుగుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు సహజ భాషా అవగాహనలో పురోగతిని కూడా సూచిస్తాయి, రోజువారీ సంభాషణలను  సులభతరం చేస్తాయి. సామ్‌సంగ్ గ్యాలరీలో ఒక నిర్దిష్ట ఫోటోను అడగండి మరియు సహజంగా ఆ నిర్దిష్టమైన ఫోటోని కనుగొనండి లేదా సెట్టింగ్‌లలో డిస్‌ప్లే ఫాంట్‌ల పరిమాణాన్ని సర్దుబాటు చేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా నేతలు వేధించారంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన యువకుడు తెల్లారేసరికి శవమై తేలాడు...