Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

Advertiesment
health tips

ఐవీఆర్

, శనివారం, 18 జనవరి 2025 (19:48 IST)
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్ వినియోగదారులు తమ ఆరోగ్యాన్ని మరింత సమగ్రంగా నిర్వహించడంలో సహాయపడటానికి సామ్‌ సంగ్ హెల్త్ యాప్‌లో హెల్త్ రికార్డ్స్ ఫీచర్‌ను జోడించినట్లు ప్రకటించింది. వినియోగదారులు తమ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌ను నేరుగా సామ్‌సంగ్ హెల్త్ మొబైల్ యాప్ ద్వారా సృష్టించి యాక్సెస్ చేయడానికి హెల్త్ రికార్డ్స్ ఫీచర్ వీలు కల్పిస్తుంది. భారతదేశం అంతటా ఆరోగ్య సంరక్షణ సంస్థలు రూపొందించే తమ ఆరోగ్య డేటాను వినియోగదారులు ఇప్పుడు సులభంగా నిర్వహించవచ్చు. ఇది వ్యక్తులు తమ వ్యక్తిగత ఆరోగ్య రికార్డులను నిర్వహించే విధానాన్ని మారుస్తుంది.
 
దేశ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్‌తో సజావైన, సురక్షితమైన ఏకీకరణను అందించడం ద్వారా తన వినియోగదారులకు సాధికారత కల్పించడానికి సామ్‌సంగ్ చేపట్టిన ఈ కొత్త కార్యక్రమం భారత ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రాజెక్ట్‌తో అనుసంధానించబడింది. ‘‘సామ్‌సంగ్ కస్టమర్ అవసరాలకు ప్రాధాన్యతనిస్తుంది. వారి రోజువారీ అనుభవాలను మెరుగుపరచడానికి ఉత్పత్తులు, సేవలను నిరంతరం మెరుగుపరుస్తుంది. భారతదేశానికి సంబంధించి సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో హెల్త్ రికార్డ్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టడం అనేది డిజిటల్ హెల్త్ రికార్డులకు అనుకూలమైన యాక్సెస్‌ను అందించడానికి, వైద్యులు లేదా కేర్‌టేకర్లతో ఎప్పుడైనా సురక్షితమైన రీతిలో డేటా షేరింగ్‌ను ఎనేబుల్ చేయడానికి మాకు గల అంకితభావాన్ని చాటిచెబుతుంది. ఈ ఫీచర్ వినియోగదారులు తమ ఆరోగ్య చరిత్రను నిర్వహించడానికి, పురో గతిని ట్రాక్ చేయడానికి, తమ శ్రేయస్సుపై మెరుగైన నియంత్రణను కొనసాగించడానికి సాధికారికతను ఇస్తుం ది’’ అని నోయిడాలోని సామ్‌సంగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ క్యుంగ్యున్ రూ అన్నారు.
 
భారతదేశంలోని ప్రముఖ ఏబీడీఎం సర్టిఫైడ్ ఇంటిగ్రేటర్ అయిన ఎకా కేర్‌తో సామ్‌సంగ్ లోని ఆర్ అండ్ డి, యూఎక్స్ డిజైన్, కన్స్యూమర్ ఎక్స్‌పీరియన్స్ బృందాల సహకార ప్రయత్నం ఫలితంగా హెల్త్ రికార్డ్స్ ఫీచర్ ఏర్పడింది. ఈ ఫీచర్‌తో, వినియోగదారులు తమ ఆధార్ లేదా మొబైల్ ఫోన్ నంబర్‌లతో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో ఏబీహెచ్ఏ ఖాతా కోసం నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న తర్వాత, వారు ప్రిస్క్రిప్షన్‌లు, ల్యాబ్ ఫలితాలు, ఆసుపత్రి సందర్శనలు, మరిన్నింటితో సహా వారి వైద్య చరిత్రను చూసుకునేందుకు యాక్సెస్ పొందుతారు- అన్నీ వారి ప్రత్యేకమైన ఏబీహెచ్ఏ ఐడీలకు సురక్షితంగా లింక్ చేయబడ్డాయి.
 
‘‘సామ్‌సంగ్‌తో ఈ భాగస్వామ్యం పట్ల ఎకా కేర్‌లో మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇది భారతదేశం అంతటా ఏబీడీఎం స్వీకరణను గణనీయంగా వేగవంతం చేస్తుంది. దేశంలో మరింత అనుసంధానించబడిన, సమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ఈ భాగస్వామ్యం ఒక కీలక  అడుగు" అని ఎకా కేర్ సహవ్యవస్థాపకుడు దీపక్ తులి అన్నారు. డిజిటలైజేషన్ శక్తిని ఉపయోగించడం ద్వారా భారతీయులు తమ వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ నిర్వహణ తీరుతెన్నులను విప్లవాత్మకంగా మార్చడమే సామ్‌సంగ్ లక్ష్యం. వినియోగదారులు ఇప్పుడు తమ ఆరోగ్య రికార్డులను ఏబీడీఎం సర్టిఫైడ్ సెక్యూర్ హెల్త్ లాకర్లలో సురక్షితంగా నిల్వ చేయవచ్చు, గజిబిజిగా ఉండే కాగితాల భారం పడకుండా ఉండవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?