Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జియో టీవీ వెబ్ వెర్షన్‌‌లో సాంకేతిక లోపం.. ఏడాది పట్టొచ్చు..

జియో టీవీ వెబ్ వెర్షన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఆరంభమైన కాసేపట్లోనే జియో టీవీ వెబ్ వెర్షన్ ఆగిపోయింది. జియో టీవీ వెబ్ వెర్ష‌న్‌లో త‌లెత్తిన సాంకేతిక స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి, తిరిగి టీవీ సేవ‌

జియో టీవీ వెబ్ వెర్షన్‌‌లో సాంకేతిక లోపం.. ఏడాది పట్టొచ్చు..
, గురువారం, 21 డిశెంబరు 2017 (11:24 IST)
జియో టీవీ వెబ్ వెర్షన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఆరంభమైన కాసేపట్లోనే జియో టీవీ వెబ్ వెర్షన్ ఆగిపోయింది. జియో టీవీ వెబ్ వెర్ష‌న్‌లో త‌లెత్తిన సాంకేతిక స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి, తిరిగి టీవీ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డానికి దాదాపు సంవ‌త్స‌ర‌కాలం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని జియో సాంకేతిక వర్గాల ద్వారా వెల్లడి అయ్యింది. 
 
అయితే ఈ వెబ్ సైట్‌తో పాటు ఆవిష్కరించిన జియో సినిమా వెబ్ సైట్ ఎలాంటి అవాంతరాలు లేకుండా పనిచేస్తుందని జియో సంస్థ ప్రకటించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా టీవీ షోలు, సినిమాలు చూసుకోవ‌చ్చు. అందుకోసం జియో నెంబ‌ర్‌తో గానీ, జియో ఐడీతో గానీ ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
 
అయితే 425కి పైగా లైవ్ ఛానళ్లను ప్రసారం చేసే జియో టీవీని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో ఇంటర్నెట్ ద్వారా ఉచితంగా చూసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ వెబ్‌సైట్‌ని ఆవిష్క‌రించిన కొద్దిసేపట్లోనే సాంకేతిక కార‌ణాల రీత్యా ఆపేశారు. ప్ర‌స్తుతం ఆ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే 'అండ‌ర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్' మెసేజ్ చూపిస్తోందని జియో సంస్థ తెలిపింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2జీ స్కామ్‌ కొట్టివేత : వారందరూ నిర్దోషులే.. కోర్టు సంచలన తీర్పు