Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నోకియా ఫీచర్ ఫోన్ల హవా.. సేల్ ప్రారంభం

nokia
, బుధవారం, 12 అక్టోబరు 2022 (14:05 IST)
హెచ్ఎండీ గ్లోబల్ నుంచి ఇటీవల మరో క్లాసిక్ ఫోన్ ఇండియాలో రిలీజైన సంగతి తెలిసిందే. నోకియా 2600 ఫ్లిప్ (Nokia 2660 Flip) మోడల్‌ను ఇండియాలో పరిచయం చేసింది. నోకియా ఒరిజినల్ సిరీస్‌లో లాంఛ్ అయిన రెండో మొబైల్ ఇది. స్మార్ట్‌ఫోన్లు పాపులర్ అయినప్పటి నుంచి నోకియా హవా తగ్గింది. 
 
కానీ నోకియా ఫీచర్ ఫోన్లకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ యూజర్లు గతంలో తాము ఉపయోగించిన నోకియా ఫోన్లను గుర్తు చేసుకుంటూ ఉంటారు. నోకియా 2600 ఫ్లిప్ ఫోన్ ధర రూ.4,699. సేల్ మొదలైన కొన్ని రోజుల తర్వాత అమెజాన్‌లో స్టాక్ కనిపించలేదు.  
 
నోకియా 2600 ఫ్లిప్ ఫోన్‌లో ఇందులో 2.8 అంగుళాల QVGA ప్రైమరీ స్క్రీన్ ఉంటే, 1.77 అంగుళాల QQVGA సెకండరీ స్క్రీన్ కూడా ఉండటం విశేషం. ఎల్ఈడీ ఫ్లాష్ లైట్‌తో 0.3 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఎంపీ3 ప్లేయర్‌తో పాటు స్నేక్ గేమ్ సహా 8 గేమ్స్ ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా వస్తాయి.  
 
నోకియా 2600 ఫ్లిప్ ఫోన్‌లో మైక్రో యూఎస్‌బీ సపోర్ట్, 3.5ఎంఎం ఆడియో పోర్ట్, 4జీ, బ్లూటూత్ 4.2, వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఎమర్జెన్సీ బటన్ కూడా ఉంది. 5 కాంటాక్ట్స్ యాడ్ చేయొచ్చు. బ్లాక్, రెడ్, బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. ఇక నోకియా ఇటీవల నోకియా 8210 4జీ మోడల్‌ను కూడా ఇండియాలో లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో రూ.500 కోట్ల అప్పును సేకరించిన జగన్ సర్కారు