వివాదాస్పద ప్రైవసీ అప్‌డేట్‌ను వెనక్కి తీసుకోవాలని వాట్సాప్‌కు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశంలోని వినియోగదారుల సమాచార గోప్యత, భద్రతను గౌరవించాలని ఆ సంస్థకు భారత్ స్పష్టం చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గోప్యత వివాదానికి సంబంధించి పలు ప్రశ్నల్ని ప్రభుత్వం వాట్సాప్ సీఈఓకు లేఖ రూపంలో సంధించిందని పేర్కొన్నాయి.
తమ షరతులకు అంగీకరించని వినియోగదారులకు సేవలు నిలిచిపోతాయని వాట్సాప్ చెప్పడాన్ని కూడా కేంద్రం ఖండించింది. యూరప్‌లో వినియోగదారులకు ఒకవిధంగా, భారతీయులకు మరోవిధంగా ప్రైవసీ నిబంధనలు ఎందుకు అని ప్రశ్నించింది. భారతీయుల హక్కుల రక్షణ పట్ల గౌరవం ప్రదర్శించని ఈ తీరును, చాలా తీవ్రంగా పరిగణిస్తామని భారత్ వాట్సాప్ తేల్చిచెప్పింది
వాట్సాప్ వ్యవహరించిన తీరుపై కేంద్రప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆ సంస్థకు స్పష్టీకరించింది. వాట్సాప్ సీఈఓ విల్ కాథ్‌కార్ట్‌కు తమ అభ్యంతరాలతో కూడిన లేఖను పంపించింది. వినియోగదారుల సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకోవడమంటే భారతీయుల్ని భద్రతపరమైన ప్రమాదానికి గురిచేయడమేనని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.