Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ నయా ప్రొటోకాల్ : సిక్స్ కొడితే బాల్ మార్చాల్సిందే...

ఐపీఎల్ నయా ప్రొటోకాల్ : సిక్స్ కొడితే బాల్ మార్చాల్సిందే...
, మంగళవారం, 10 ఆగస్టు 2021 (19:24 IST)
కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి కారణంగా భారత్‌లో ఆగిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ తిరిగి ప్రారంభంకానుంది. ఈ మిగిలిన టోర్నీని ఇండియా నుంచి యూఏఈకి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తరలించింది. అయితే అక్క‌డ కూడా టోర్నీకి మ‌రోసారి ఎలాంటి అడ్డంకులు రాకుండా క‌ఠిన‌మైన కొవిడ్‌ ప్రొటోకాల్స్‌ను సిద్ధం చేసింది. సిక్స్ కొడితే బాల్ మార్చ‌డం, ఇమ్మిగ్రేష‌న్ ప్ర‌క్రియ అవ‌స‌రం లేకుండానే ప్లేయ‌ర్స్‌ను యూఏఈకి త‌ర‌లించ‌డం స‌హా మ‌రెన్నో కొత్త కొవిడ్ నిబంధ‌న‌లు వ‌చ్చి చేరాయి. 
 
ఈ టోర్నీ కోసం బీసీసీఐ రూపొందించిన కొత్త నిబంధనలను ఓసారి పరిశీలిస్తే, 
 
సాధారణంగా సిక్స్ కొట్టిన‌ప్పుడు బాల్ స్టాండ్స్‌లో లేదా స్టేడియం బ‌య‌ట ప‌డితే.. ఫోర్త్ అంపైర్ వెంట‌నే మ‌రో బాల్ అందించాలి. ఆ స్టాండ్స్ లేదా బ‌య‌ట‌ప‌డిన బాల్‌ను ఆల్క‌హాల్ ఆధారిత వైప్స్‌తో శానిటైజ్ చేసి బాల్స్ లైబ్రరీలో ఉంచాలి. 
 
ఆ త‌ర్వాత ఎప్పుడైనా అవ‌స‌రమైతే ఆ బాల్ ఇవ్వొచ్చు. క్రికెట్ బాల్ ద్వారా కొవిడ్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువే అని బీసీసీఐ ఓ శాస్త్రీయ అధ్య‌య‌నం ద్వారా చెప్పినా.. ఎలాంటి రిస్క్ తీసుకోవ‌ద్ద‌న్న ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.
 
ఒక‌వేళ ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమ‌తించి పక్షంలో వారిని స్టేడియంలోని పైన ఉన్న స్టాండ్స్‌లో మాత్ర‌మే కూర్చోబెడ‌తారు. ఇక గ్రౌండ్‌లో ఉమ్మ‌డం, ముక్కు చీద‌డం వంటివి చేయ‌కూడ‌దు. కేవ‌లం వాష్‌రూమ్‌ల‌కు మాత్ర‌మే అవి పరిమితం.
 
ప్లేయ‌ర్స్‌, సిబ్బంది బ‌యో బబుల్‌లోకి వెళ్లే ముందు ఆరు రోజుల ఐసోలేష‌న్‌లో ఉండాలి. మూడు నెగ‌టివ్ ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి. ఇంగ్లండ్‌లో ఉన్న ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ బబుల్ నుంచి బ‌బుల్‌లోకి మారేందుకు కొన్ని గైడ్‌లైన్స్ పాటిస్తే.. దుబాయ్‌లో వారికి క్వారంటైన్ అవ‌స‌రం లేదు.
 
దుబాయ్‌లో ఉన్న గోల్ఫ్ క్ల‌బ్ మిన‌హాయించి ప్లేయ‌ర్స్‌, సిబ్బంది.. బార్లు, రెస్టారెంట్లు, కెఫేలు, జిమ్‌ల‌కు వెళ్ల‌డం నిషేధం.
 
ఒక‌వేళ మ్యాచ్‌లు జ‌రిగే స‌మ‌యంలో ఎవ‌రైన అభిమాని గ్రౌండ్‌లోకి వ‌చ్చి ప్లేయ‌ర్స్‌ను తాకితే.. స‌ద‌రు ప్లేయ‌ర్స్ వెంట‌నే గ్రౌండ్ బ‌య‌ట‌కు వెళ్లి త‌మ దుస్తుల‌ను మార్చుకోవాలి. ఆ త‌ర్వాత చేతుల‌ను 20 సెక‌న్ల పాటు శుభ్రంగా క‌డుక్కున్న త‌ర్వాతే ఇత‌ర ప్లేయ‌ర్స్‌తో క‌ల‌వాలి.
 
ప్లేయ‌ర్స్ త‌మ వాట‌ర్ బాటిల్స్‌ను ఎవ‌రికి వారే ఉప‌యోగించాలి. ఒక‌రి బాటిల్ మ‌రొక‌రు వాడ‌కూడ‌దు. ఇలాంటి అనేక కఠిన నిబంధనలను ప్రవేశపెట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్?