Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెప్టెంబర్-అక్టోబర్‌లో యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. టీ-20 ప్రపంచ కప్ కూడా..?

సెప్టెంబర్-అక్టోబర్‌లో యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. టీ-20 ప్రపంచ కప్ కూడా..?
, బుధవారం, 26 మే 2021 (11:00 IST)
IPL
దేశంలో కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లను అర్ధాంతంగా ముగించాల్సి వచ్చింది. అయితే ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్‌లకు రంగం సిద్ధం అయ్యింది.  సెప్టెంబర్-అక్టోబర్‌లో ఐపీఎల్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధం అవుతోంది. మే 29న వారి ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం) తర్వాత ఈ ప్రకటనను అధికారికంగా ప్రకటించవచ్చు. 
 
COVID-19 కారణంగా వాయిదా వేసిన 14వ సీజన్‌ సెప్టెంబర్ 16-20 వరకు పునః ప్రారంభించి అక్టోబర్ 9-10 తేదీలతో ముగుస్తుంది. అక్టోబర్ 18 నుండి ట్వంటీ-20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. అలాగే భారత్-పాకిస్థాన్‌లో క్రికెట్ లీగ్స్ నిర్వహణకు కరోనా అడ్డంకిగా మారడంతో అందరూ యూఏఈ వైపు చూస్తున్నారు. అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్న క్రికెట్ గ్రౌండ్స్ అందుబాటులో ఉన్నాయి.
 
జూన్‌లో పీఎస్ఎల్, సెప్టెంబర్-అక్టోబర్‌లో ఐపీఎల్ నిర్వహణకు గ్రౌండ్లను బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌కు కూడా యూఏఈ స్టేడియంలో ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్ మధ్యలోనే వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్‌లలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో విదేశీ క్రికెటర్లు వచ్చి ఆయా లీగ్స్‌లో ఆడటానికి సిద్ధంగా లేదు. దీంతో బీసీసీఐ, పీసీబీ ప్రత్యామ్నాయ వేదికలుగా యూఏఈని ఎంచుకున్నాయి. 
 
ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ ఆధ్వర్యంలో అక్కడ మూడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలు ఉన్నాయి. దాంతో పాటు ఐసీసీకి చెందిన గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటికి డిమాండ్ పెరిగింది. అలాగే అబుదాబిలోని షేక్ జాయేద్ క్రికెట్ స్టేడియం అత్యంత ఆదునికమైనది. ఇక్కడ క్రికెటర్లకు అవసరమైన సౌకర్యాలు అన్నీ ఉన్నాయి.

స్టార్ హోటల్స్‌కు దగ్గరగా ఉండే ఈ స్టేడియంలో జూన్ 1 నుంచి పాకిస్తాన్ సూపర్ లీగ్ మిగిలిన మ్యాచ్‌ల జరుగనున్నాయి. ఆ తర్వాత ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లలో కొన్ని ఇక్కడ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది. 
 
ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలోని మూడు స్టేడియంలను బీసీసీఐ ఉపయోగించుకోనుంది. గత ఏడాది ఆతిథ్యంతోపాటు స్టేడియం అద్దెలు కలిపి బీసీసీఐ దాదాపు రూ. 100 కోట్లు ఈసీబీకి చెల్లించింది. జూన్ 1 నుంచి అబుదాబి వేదికగా పీఎస్ఎల్ నిర్వహించనున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. 
 
అబుదాబీని తమ న్యూట్రల్ గ్రౌండ్‌గా పీసీబీ ఎప్పటి నుంచో అద్దె చెల్లిస్తుంది. టీ20 వరల్డ్ కప్ కనుక ఇండియా నుంచి తరలిస్తే ఈ వేదికను కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

మరోవైపు ఇండియాలో అక్టోబర్-నవంబర్‌లో నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్‌కు కరోనా కారణంగా ఆటంకాలు ఏర్పడితే మ్యాచ్‌లను యూఏఈ తరలించే అవకాశం ఉంది.

అక్కడ అందుబాటులో ఉన్న 5 అంతర్జాతీయ స్టేడియంలతో పాటు ఇతర క్రికెట్ గ్రౌండ్లను కూడా ఐసీసీ ఉపయోగించుకోనుంది. ఈ విషయం జూన్ 1వ తేదీన జరిగే ఐసీసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బయో-సెక్యూర్ బబుల్‌లోకి భారత క్రికెటర్లు.. జూన్ 2న ఇంగ్లండ్ గడ్డపైకి కోహ్లీ సేన