Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధోనీ వుంటే సింహం.. ధోనీ లేకుంటే ఎలుకా? (video)

Advertiesment
Mumbai Indians
, శనివారం, 27 ఏప్రియల్ 2019 (16:09 IST)
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడంపై అప్పుడే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముంబై ఇండియన్స్‌తో సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 46 పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని చెన్నై ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. జ్వరం కారణంగా ఈమ్యాచ్‌కు ధోని దూరం కాగా.. సురేశ్‌ రైనా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. 
 
అంబటి రాయుడు కీపింగ్‌ చేశాడు. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై జట్టు.. ధోని లేకుంటే మాత్రం గతి తప్పుతుంది. దీంతో ధోనీ లేకుంటే చెన్నై చెత్తేనని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ధోనీ లేకపోతే చెన్నై గెలవదంతేనని జోస్యం చెప్తున్నారు. చెన్నై భవితవ్యం ధోనీపైనే ఆధారపడి వుందని చెప్తున్నారు. అయితే ధోనీ వుంటేనే చెన్నై గెలవడం మంచి పద్ధతి కాదని చెన్నై ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు ధోనీ లేకుంటే చెన్నై ఓటమి ఖాయమైందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి 
 
ఇందులో భాగంగా ఈ నెల 17న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌కి గాయం కారణంగా ధోనీ దూరమవ్వగా.. ఆ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన చెన్నై.. తాజాగా ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌కి జ్వరంతో ధోని జట్టులో లేకపోవడంతో చిత్తుగా ఓడిపోయింది. ప్రస్తుతం ఇదే అంశంపై చెన్నై అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు. ఫన్నీ మీమ్స్‌, కామెంట్స్‌తో ఆటగాళ్లను ఆడుకుంటున్నారు. ధోని లేకుంటే చెన్నై జట్టు ఉత్తదేనని తీసిపారేస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోహిత్ హిట్ కొట్టాడు.. చెన్నైకి చుక్కలు చూపించాడు.. రికార్డులు అదుర్స్