Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తూర్పు ఆసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు... ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు!!

Hamas

వరుణ్

, సోమవారం, 5 ఆగస్టు 2024 (11:49 IST)
తూర్పు ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌పై హిజ్బుముల్లా సంస్థతో పాటు ఇరాన్ కలిసి సోమవారం నుంచే దాడులు మొదలుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అమెరికా విదేసాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు జీ7 దేశాల విదేశాంగ మంత్రులను ఆయన అలెర్ట్ చేసినట్టు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
కాగా తమ భూభాగంపై దాడులను తిప్పికొట్టేందుకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వం సమాయత్తమవుతోందని, ఇరాన్‌పై ముందస్తు దాడికి అనుమతి ఇవ్వొచ్చని ఇజ్రాయెల్ ప్రముఖ దినపత్రిక 'టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్' పేర్కొంది. ఇందులో భాగంగానే ప్రముఖ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మొస్సాద్, షిన్ బెట్ల చీఫ్లు డేవిడ్ బర్నియా, రోనెన్ బార్ల‌తో నెతన్యాహు సమావేశమయ్యారని పేర్కొంది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి యోవ్ గల్లంట్, ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జి హలేవి కూడా పాల్గొన్నారని వివరించింది.
 
కాగా శనివారం ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక చేసింది. హిజ్బుల్లా కేవలం సైనిక లక్ష్యాలకే పరిమితం కాబోదని, ఇజ్రాయెల్‌లోని ఇతర ప్రాంతాలపై కూడా గురిపెడుతుందని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇజ్రాయెల్ ఆర్మీ పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్లో హమాస్ నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రతీకార చర్యగా హమాస్‌‍పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ పోలీసులు కూడా రైలు ప్రయాణ టిక్కెట్లు కొనుగోలు చేయాల్సిందే : రైల్వే శాఖ స్పష్ట