Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హమాస్ చీఫ్ హనియే హత్య.. ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడులకు ఇరాన్ పిలుపు

russia strike

వరుణ్

, గురువారం, 1 ఆగస్టు 2024 (12:49 IST)
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య మరోమారు ఉద్రిక్తత నెలకొంది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య కేసుతో మధ్యప్రాచ్యంలో మరోమారు ఉద్రిక్తత నెలకొంది. హమాస్ చీఫ్ హత్యను తీవ్రంగా ఖండించిన ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ.. ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడులకు పిలుపునిచ్చారు. పైగా, ఇస్మాయిల్ హనియే అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందులో ఏం మాట్లాడుతారన్న అంశంపై ఇపుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
మరోవైపు, ఇస్మాయిల్ హత్యకు గురైనట్లు మీడియాలో వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగిందని, ఈ భేటీలో అధ్యక్షుడు ఖమేనీ దాడికి ఆదేశాలు ఇచ్చారని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ముగ్గురు అధికారులకు ఆదేశాలు వెళ్లాయని, ఇందులో ఇద్దరు రివల్యూషనరీ గార్డ్స్ అధికారులు కూడా ఉన్నారని పేర్కొంది..
 
కాగా హమాస్ అధినేత ఇస్మాయిల్ హత్య ఇజ్రాయెల్ పనేనని ఇరాన్, హమాస్ బలంగా నమ్ముతున్నాయి. అయితే ఇజ్రాయెల్ మాత్రం తమ ప్రమేయం లేదని ఖండించింది. అయితే విదేశాలలో శత్రువులను మట్టుబెట్టిన చరిత్ర ఇజ్రాయెల్‌కు ఉండడంతో ఇస్మాయిల్ హత్యలో ఇజ్రాయెల్ ప్రమేయం ఉందని ఇరాన్ విశ్వసిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.
 
ఇదిలావుంటే, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు. మంగళవారం టెహ్రాన్‌లోని ఇస్మాయిల్ నివాసంపై జియోనిస్టులు జరిపిన దాడిలో ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యారని హమాస్ నిర్ధారించింది. పాలస్తీనాలో యూదుల హక్కులు, ప్రత్యేక రాజ్యం కోసం పోరాడుతున్న జియోనిస్టులు జరిపిన ఈ దాడిపై దర్యాప్తు కొనసాగుతోందని హమాస్ తెలిపింది. ఇరాన్ నూతన అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఇస్మాయిల్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ వెళ్లగా, ఈ దాడి జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంతకీ కమహా హ్యారీస్ శ్వేత జాతీయురాలా.. నల్ల జాతీయురాలా? ట్రంప్ ప్రశ్న!!