Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లల మృతికి ఇజ్రాయెల్ ప్రతీకారం... హిజ్బుల్లా కమాండర్‌ను అంతం!!

ariel strike

వరుణ్

, బుధవారం, 31 జులై 2024 (10:44 IST)
ఇటీవల ఫుట్‌బాల్ మైదానంపై జరిగిన దాడిలో అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి సూత్రధారిగా వ్యవహరించిన హిజ్బుల్లా కమాండ్‌ ఫాడ్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. జెరూసలేంలోని బీరుట్‌లై ఇజ్రాయెల్ విమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఫాడ్ షుక్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇటీవల ఇజ్రాయెల్‌లో గోలన్ హైట్స్‌లో ఓ ఫుట్‌బాల్ మైదానంపై రాకెట్ దాడిలో 11 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. రాకెట్ దాడికి సూత్రధారి అయిన హిజ్బుల్లా కమాండర్ ఫాడ్ షుక్‌ను మట్టుబెట్టింది. జెరూసలేంలోని బీరుట్లో అతడు దాగి ఉన్న ప్రాంతంపై మంగళవారం తమ వైమానిక ఫైటర్ జెట్లు దాడి చేశాయని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. గోలన్ హైట్స్‌ రాకెట్ దాడికి అతడే కారణమని పేర్కొంది. హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థలో ఫాడ్ షుక్ సీనియర్ కమాండర్ అని, ఉగ్ర సంస్థ వ్యూహాత్మక విభాగానికి చీఫ్‌గా వ్యవహరిస్తుంటాడని ఒక ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా శనివారం సాయంత్రం ఉత్తర ఇజ్రాయెల్లోని సాకర్ మైదానంలో హిజ్బుల్లా ఉగ్రవాదులు ఇరాన్ ఫలక్-1 రాకెట్‌తో దాడి చేసింది. ఈ ఘటనలో 12 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. గాజా యుద్ధం మొదలైన నాటి నుంచి ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా జరుపుతున్న దాడులకు షుక్ నాయకత్వం వహించాడని, వ్యూహాలు అతడివేనని మిలటరీ పేర్కొంది. 1990వ దశకంలో తమ దేశానికి చెందిన ముగ్గురు సైనికుల హత్యలోనూ అతడి పాత్ర ఉందని ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. హిజ్బుల్లాకు గైడెడ్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, యాంటీ-షిప్ క్షిపణులు, దీర్ఘ-శ్రేణి రాకెట్లు, యూఏవీలు వంటి అధునాతన ఆయుధాలను అతడే సమకూర్చుతుంటాడని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటి టెర్రస్‌పై దూసుకెళ్లిన బుల్లెట్.. మహిళకు గాయం