Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అది పొట్టా లేకుంటే చెత్తబుట్టా? నాణేలు, రాళ్లు, మేకులు..?

Coins
, గురువారం, 23 జూన్ 2022 (17:51 IST)
Coins
అవును అది పొట్టకాదు.. చెత్తబుట్ట. అతడికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళితే.. టర్కీకి చెందిన బుర్హాన్ డెమిర్ అనే వ్యక్తి.. తన 35 ఏళ్ల తమ్ముడు తీవ్రమైన కడుపు నొప్పి ఉందని చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అతడికి వైద్యులు కొన్ని పరీక్షలు చేయించాలని సిఫార్సు చేయడంతో.. ఆయా టెస్టులన్నీ చేయిస్తాడు డెమిర్.
 
అనంతరం వచ్చిన స్కానింగ్ రిపోర్ట్స్ చూసి డాక్టర్లకు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. రోగి కడుపులో నాణేలు, రాళ్లు, మేకులు, గాజు ముక్కలు.. లాంటివి వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. అవి కడుపులోకి ఎలా చేరాయో తెలియక డాక్టర్లు మతిపోయింది. 
 
సదరు రోగి అన్నను దీని గురించి ప్రశ్నించగా.. తన తమ్ముడికి ఇలా వస్తువులను మింగే అలవాటుందని చెప్పాడు. డాక్టర్లు వెంటనే రోగికి ఆపరేషన్ చేసి.. ఆ వస్తువులను బయటికి తీశారు. అవన్నీ టేబుల్‌పై పేర్చగా.. మొత్తం 233 వస్తువులు వచ్చాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంజారాహిల్స్‌లో దారుణం.. ఆస్పత్రి ఖర్చు రూ.60లక్షలు.. బిడ్డ బతకలేదే!