Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 5 March 2025
webdunia

బంజారాహిల్స్‌లో దారుణం.. ఆస్పత్రి ఖర్చు రూ.60లక్షలు.. బిడ్డ బతకలేదే!

Advertiesment
baby boy
, గురువారం, 23 జూన్ 2022 (15:30 IST)
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. రఘునాథ్‌రెడ్డి, సువర్ణ దంపతులు నగరంలో నివాసం ఉంటున్నారు. ప్రసవ సమయం దగ్గర పడడంతో సువర్ణ ఏప్రిల్ 24న బంజారాహిల్స్‌లోని రెయిన్ బో ఆస్పత్రిలో చేరింది. 
 
12 రోజుల తరువాత ఆమె కవలలకు జన్మనిచ్చింది. అయితే.. పుట్టిన మూడవ రోజే ఓ చిన్నారి మృతిచెందింది. ఆ చిన్నారి పాప చికిత్సకు 19 లక్షల 90 వేలు బిల్లు వేశారు. 
 
మరో చిన్నారి చికిత్స పొందుతూ బుధవారం చనిపోగా, ఆ శిశువు చికిత్సకు 33 లక్షల 16 వేలు బిల్లు వేశారు. ఇద్దరూ చిన్నారులు మృతి చెందగా, చికిత్స పేరుతో రూ.60 లక్షలపైగా ఆస్పత్రికి చెల్లించామని బాధితులు తెలిపారు. 
 
ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ సంతానాన్ని కోల్పోయామని సువర్ణ, రఘునాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెయిన్ బో ఆసుప్రతి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సక్రమంగా స్కూలుకు పంపితేనే అమ్మ ఒడి పథకం : మంత్రి బొత్స