Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్ట్రేలియాలో తీవ్ర నీటి ఎద్దడి..అందుకు ఏం చేస్తున్నారో తెలుసా?

ఆస్ట్రేలియాలో తీవ్ర నీటి ఎద్దడి..అందుకు ఏం చేస్తున్నారో తెలుసా?
, బుధవారం, 15 జనవరి 2020 (09:19 IST)
ఆస్ట్రేలియాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. దీనికి కారణం ఒంటెలు అధికంగా నీళ్లు తాగేస్తున్నాయని ఆ దేశ అధికారులు ఆరోపిస్తున్నారు. అందుకే ఒంటెలను చంపేయాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆ దేశ అధికారులు హెలికాఫ్టర్లలో గాలిస్తూ కంటికి కనిపించిన ఒంటెను చంపేస్తున్నారు. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో మండిపోతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు కారణంగా కార్చిచ్చు చెలరేగింది. ఈ కార్చిచ్చు వేలాది కిలోమీటర్ల మేర వ్యాపించడంతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అలాగే, కోట్ల సంఖ్యలో జంతువులు సజీవ దహనమయ్యాయి. 
 
మరోవైపు ఆస్ట్రేలియాను తీవ్ర నీటి కరవు వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఒంటెల కారణంగా నీటికి మరింత కటకట ఏర్పడుతున్న నేపథ్యంలో వేల సంఖ్యలో ఒంటెలను వధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అధికారులు హెలికాపర్లలో తిరుగుతూ పెద్ద సంఖ్యలో ఒంటెలను చంపేస్తున్నారు. ఇప్పటివరకు ఐదు రోజుల్లో 5000కి పైగా ఒంటెలను సంహరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంకలో ఐదుగురు భారతీయులు అరెస్ట్‌