దక్షిణాఫ్రికా దేశంలో సరికొత్త కరోనా వేరియంట్ పుట్టుకొచ్చింది. గతంలో కనుగొన్న వేరియంట్ల కంటే ఇది చాలా ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బి.1.1.529గా గుర్తించిన ఈ వైరస్ ఇపుడు కలకలం సృష్టిస్తుంది. పైగా, శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం ఏడు దేశాల ప్రజల అంతర్జాతీయ రాకపోకలపై ప్రయాణ నిషేధం విధించింది. బి.1.1.529 వేరియంట్ అధికంగా వెలుగు చూస్తున్న దేశాలైన సౌతాఫ్రికా, జింబాబ్వే, బోట్స్‌వానా, మొజాంబిక్, లెసోథో, ఎస్వతినీ దేశాలపై ట్రావెన్ బ్యాన్ విధించాయి. ఈ దేశాలకు చెందిన ప్రయాణికులు, పర్యాటకులను తమ దేశంలోకి అనుమతించేది లేదని పేర్కొంది.
అలాగే, ఈ ఏడు దేశాలపై జోర్డాన్ దేశం కూడా నిషేధం విధించింది. ఈ దేశానికి చెందినవారు కాకుండా ఈ దేశాలకు చెందిన వారిని దేశంలోకి అనుమతించేది లేదని పేర్కొంది. అయితే, జోర్డాన్, సౌదీ విధించిన ట్రావెన్ బ్యాన్ దేశాల జాబితాలో భారత్ లేకపోవడంతో కాస్త ఉపశమనం కలిగించే అంశం.