Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇక నో క్వారెంటైన్, దర్జాగా వచ్చేయండి సౌదీ అరేబియా

Advertiesment
ఇక నో క్వారెంటైన్, దర్జాగా వచ్చేయండి సౌదీ అరేబియా
, మంగళవారం, 24 ఆగస్టు 2021 (20:40 IST)
సౌదీ అరేబియా తీపి కబురు చెప్పింది. భారతదేశంలో వుండి సౌదీకి ఎప్పుడు తిరిగి వెళ్లాలా అని ఎదురుచూస్తున్నవారికి ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. రెండు డోసుల టీకాలు తీసుకున్నవారు ఇకపై క్వారెంటైన్లో వుండక్కర్లేదనీ, నేరుగా వచ్చేయవచ్చని తెలిపింది. ఐతే ఆ రెండు డోసులు సౌదీలో తీసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది.
 
సౌదీ అరేబియాలో రెండు డోసుల వ్యాక్సిన్ అందుకున్నవారు ఇక ఎంతమాత్రం ఆలోచించకుండా హ్యాపీగా సౌదీ విమానం ఎక్కేయవచ్చు. ఈ విషయాన్ని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఐతే భారతదేశంలో డోసులు తీసుకున్నవారి సంగతి గురించి మరికాస్త వెయిట్ చేయాల్సి వున్నట్లే కనబడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లీజ్, వాళ్లను తీసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్‌ను డొల్ల చేయొద్దు: బ్రతిమాలుతున్న తాలిబన్లు, ఎవరిని?