అరబ్ దేశాల్లో చట్టాలు ఎంతో కఠినంగా ఉంటాయి. చిన్నపాటి నేరం చేసినా పెద్ద శిక్షలను అమలు చేస్తుంటారు. అలాంటి దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. ఇక్కడ ఆదివారం ఒక్క రోజే ఏకంగా 81 మందికి ఉరిశిక్షలను అమలు చేశారు. ఇది సంచలనం సృష్టించింది.
మరణశిక్షకు గురైన వారిలో కొందరు అల్‌ఖైదా, ఐసిస్, యెమెన్ హౌతీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన్నట్టు నిర్ధారణ అయిన తీవ్రవాదులు ఉన్నారు. ఉరిశిక్షలను అమలు చేసిన వారిలో 73 మంది సౌదీ అరేబియా వాసులు కాగా, ఏడుగురు యెమెన్ దేశస్తులు, ఒక సిరియా పౌరుడు కూడా ఉన్నాడు.
గత మూడున్న దశాబ్దాల కాలంలో ఇంతమందిని ఒకేరోజు ఉరిశిక్షలు అమలు చేయడం సౌదీ అరేబియాలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత 1980లో ఒకే రోజు 63 మందికి ఉరిశిక్షలను అమలు చేయగా, ఇపుడు ఈ సంఖ్య 81గా ఉంది.